JAISW News Telugu

Kalki 2898 AD : కల్కి మూవీ రివ్యూ.. హిట్టా ఫట్టా?

Kalki 2898 AD

Kalki 2898 AD

Kalki 2898 AD : భారతీయ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి సినిమా ఈ రోజు విడుదలైంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా థియేటర్లకు చేరుకుంది. దేశ విదేశాల్లో ఈ సినిమా ఫస్ట్ షోలు మొదలయ్యాయి.

ఓ వైపు సినిమాపై వస్తున్న రివ్యూలు బయటికి వస్తూనే ఉన్నాయి. మరోవైపు  ట్రేడ్ విశ్లేషకులు ప్రభాస్ బాక్సాఫీస్ పవర్ పై దృష్టించారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టడం ఖాయమని  ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు. ‘కల్కి 2898 AD’ హిందీ వెర్షన్‌లోనూ అద్భుతాలు సృష్టించడం ఖాయమని చెబుతున్నారు.  అమెరికాలో బుధవారం ప్రీమియర్స్ వేయగా, ఇండియాలో  గురువారం అర్ధరాత్రి నుంచే  స్పెషల్ షోలు పడుతున్నాయి.  ‘కల్కి 2898 AD’  మూవీ రిపోర్ట్ ఏంటి? సినిమా హిట్టా కాదా, హిట్టయితే ఏ రేంజ్ హిట్టో తెలుసుకుందాం.

ఇక కల్కి మూవీ కథ విషయానికి వస్తే ఈ భూమ్మీద విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కిగా అవతరిస్తాడనే పురాణాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ పురాణాలను బేస్ చేసుకొని నాగ్ అశ్విన్ సినిమా కథ రాసుకున్నాడు. ఇక కలి (కమలహాసన్) ఎలాంటి విధ్వంసకర పరిస్థితులు సృష్టించాడు. భైరవ(ప్రభాస్) కల్కి కలిసి కలిని ఎలా అడ్డుకున్నారు. అతన్ని ఎలా అంతం చేశారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటి ట్రెండ్ కు భిన్నమైన కథను ఎంచుకొని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతీ సీన్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ప్రభాస్ కెరీర్ లో  బాహుబలి తర్వాత ఈ సినిమా విజువల్స్ మరింత అద్భుతంగా ఉన్నాయి. ఈ విజువల్స్ భారతీయ సినిమాకే కొత్త అని చెప్పవచ్చు. ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు అశ్విన్. తను ఏదైతే ఊహించాడో అది తెరమీద మీద చూపించడంలో నూరు శాతం న్యాయం  చేశాడని చెప్పొచ్చు.  

ప్రభాస్ చేసిన భైరవ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్, భైరవకి అశ్వద్ధామ(అమితాబచ్చన్) కి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్  ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ప్రతి పాత్ర కి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మూవీ లోని ప్రతి ఒక్కరి పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడు నాగ్ అశ్విన్. ఇక దీపిక పడుకునే సీన్స్ ఎమోషనల్ గా ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అయ్యాయి. ఇక ఇందులో కొన్ని క్యామియో రోల్స్ ఆశ్యర్యానికి గురి చేస్తాయి.  

కొన్ని చోట్ల ఇవి గ్రాఫిక్స్ సీన్స్ అని ప్రేక్షకుడు గ్రహిస్తాడు. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అయితే వండర్. అయితే ఫస్ట్ హాఫ్ హాయిగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుడు కొంత బోర్ ఫీలవుతాడు. కానీ ట్విస్ట్ లతో క్యురియాసిటీ వస్తుంది.  

అమితాబచ్చన్, కమలహాసన్ నటన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఏ క్యారెక్టర్ అయినా దానికో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం బిగ్ బీ, కమల్ ప్రత్యేక. ఇందులోనూ వాళ్లు మరోసారి చెలరేగిపోయారు.  ప్రభాస్ కి కొత్త క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.  ఇక దీపికా లేకపోతే సినిమానే లేదు.  ఇక కమల్ చేసిన రోల్..  ఆయన కెరీర్ లో మరో మైలురాయి. కలి క్యారెక్టర్ తో తనలోని కొత్త నటుడిని ఆవిష్కరించుకున్నారు కమల్.  

సాంకేతిక  అంశాలు
ఈ సినిమా సాంకేతికంగా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మ్యూజిక్  డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తన బీజీఎంతో సినిమాకు ప్రాణం పోశాడు.  కథలోని ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ బీజీఎంతో ఆకట్టుకున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు వైజయంతి మూవీస్. ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే డబ్బు ఎలా ఖర్చు పెట్టారో అర్థమవుతుంది. కల్కి తెలుగు సినిమా రూపురేఖలు, హద్దులను చెరిపేసిందనే చెప్పాలి.  

ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్ ప్రభాసే. రెబల్ స్టార్ కు బిగ్ బీ  అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకునే తోడయ్యి సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు చూడని కథ, చూపించిన విధానం, విజువల్స్ సినిమాకు ప్రధాన బలం.  కాకపోతే ద్వితియార్థం కొంత నెమ్మదించింది. గ్రాఫిక్స్ పరంగా కొంత ఎఫర్ట్ పెట్టాల్సింది.  

ప్రభాస్ వన్ మ్యాన్ షో చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. మరో బ్లాక్ బస్టర్ పడినట్లే.  

జైస్వరాజ్య టీవీ రేటింగ్ : 3.25 /5 

Exit mobile version