Lok Sabha Elections : దేశంలో ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ఈసీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల కోసం జాతీయ స్ధాయిలో తీసుకోవా ల్సిన చర్యలతో పాటు పెండింగ్ లో ఉన్న ఏపీ,ఒడి శా, గోవా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం తగు ఆదేశాలు జారీ చేస్తోంది.
ఈ ప్రక్రియ ఇప్పటికే చివరి దశకు చేరుకోవడంతో కీలకమైన షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం చే స్తోంది. తాజా అంచనాల ప్రకారం మార్చి 9 తర్వా త ఏక్షణాన అయినా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ సిద్దమవుతోంది.
గతంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు మార్చి 10న ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈసారి కూడా దాదా పుగా ఒకట్రెండు రోజుల అటు ఇటుగా షెడ్యూల్ ప్రకటనకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. లోక్ సభ ఎన్ని కలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కశ్మీర్ లోనూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్దమవుతోంది. దీంతో ఈ ఎన్ని కల తేదీలు స్ధానికంగా పండుగలు, పరీక్షలు ఇ లా ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకుంటోంది.
లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించగానే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వాలు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే వీలుండదు. కేవలం ఈసీ అను మతితోనే నిర్ణయా లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ అధికారులతో, ఇటు రాజకీయ పార్టీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది.
లేకపోతే షెడ్యూల్ ప్రక టన తర్వాత తిరిగి మార్పు లు చేర్పులు చేయా ల్సిన పరిస్ధితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసీ మార్చి రెండోవారంలోనే లోక్ సభతో పాటు అసెం బ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటి స్తుందని జాతీయ మీడియా అంచనా వేస్తోంది.