Raj Tarun : హీరో రాజ్ తరుణ్ కేసు విషయంలో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. రాజ్ తరుణ్ కు కెరీర్ లో సినిమాలు సరిగా లేని సమయంలో ఆయన ప్రియురాలు లావణ్య తనను మోసం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు వేయడంతో వివాదం మొదలైంది.
తిరగబడరా సామీ సినిమా పనులు జరుగుతున్న సమయంలోనే రాజ్ తరుణ్ నమ్మించి మోసం చేశాడని అంటూ లావణ్య తెరపైకి తీసుకొచ్చింది. రాజ్ తరుణ్ తనను వాడుకుని మోసం చేశాడని ఇప్పుడు మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని వారిద్దరూ కలిసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. దీంతో సినిమాకు బదులు ప్రియురాలిని మోసం చేసిన విషయంలో రాజ్ తరుణ్ ఫేమస్ అయిపోయాడు.
ఇప్పుడు తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా తోనే రాజ్ తరుణ్ లవ్ లో ఉన్నాడని చెప్పి షాక్ ఇవ్వగా.. లావణ్య, మాల్వీ మల్వాత్రాల మధ్య కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. దీంతో ఈ కేసు రాజ్ తరుణ్ మెడకు చుట్టుకుంది. పోలీసులు కూడా రాజ్ తరుణ్ ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ పై తనకు ఎలాంటి కక్ష లేదని పరిస్థితి చేజారిపోతుందనే సమయంలోనే కేసు వేసినట్లు గతంలో లావణ్య తెలిపింది. మొన్నటి వరకు రాజ్ తరుణ్ తోనే కలిసి ఉంటానని చెప్పిన లావణ్య ప్రస్తుతం రాజ్ తరుణ్ కు కఠినంగా శిక్ష వేయాలని పోలీసులను డిమాండ్ చేస్తోంది.
మాల్వీ మాల్హోత్రా, ఆమె తమ్ముడు పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇన్ని రోజులు కేసులు వేసినా రాజ్ తరుణే నా లవర్, భర్త అని మేం పెళ్లి చేసుకున్నామని లావణ్య గట్టిగా చెప్పింది. కానీ చివరగా రాజ్ తరుణ్ ను కఠినంగా శిక్షించాలని కోరడంతో ఇక ఆమె రాజ్ తరుణ్ తో ఉండాలని అనుకోవట్లేదని అర్థమవుతుంది. ఇద్దరి మధ్య ఈ కేసుతో బంధం తెగిపోయినట్లేనని అనుకుంటున్నారు.