KCR : కేసీఆర్ మెడకు మరో ఉచ్చు.. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు?
KCR : గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరంతర విద్యుత్ కోసం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ ను కొనుగోలు చేసింది. అక్కడి డిస్కంల నుంచి మనకు అవసరమైన విద్యుత్ కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేసేందుకు పాట్నా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను ఎంక్వైరీ చేయాలని కోరింది.
దీంతో విచారణ ప్రక్రియ ప్రారంభించారు. సమాచారం, సాక్ష్యాలు, ఆధారాలు కమిషన్ పరిగణనలోకి తీసుకోనుంది. ఇందుకు గాను ఎవరైనా వాటికి సంబంధించిన ఆధారాలు ఇస్తే విచారణలో ముందుకు వెళ్లాలని చూస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులను కూడా విచారిస్తామని అంటున్నారు. దీంతో మొదట రిక్వెస్ట్ లెటర్స్ పంపించి స్పందించకుంటే సమన్లు అందజేస్తామన్నారు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పటికే పలు మోసాలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. సచివాలయ అక్రమాలు ప్రధాన పాత్ర పోషించాయి. విద్యుత్ కు సంబంధించిన భారీ స్కాం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాలతో సంబంధం లేకపోయినా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ మెడకు చుట్టుకుంటోంది. దీంతో కేసీఆర్ చేసిన నిర్వాకాలు ఇప్పడు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.
అధికారంలో ఉండగా విచ్చలవిడిగా ఒప్పందాలు చేసుకున్నారనే వాదనలు ఉన్నాయి. విద్యుత్ కోసం పలు మార్గాల్లో విద్యుత్ ను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ప్రజలకు అందించిన విషయం తెలిసిందే. విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలులో అక్రమాలు జరిగాయని తేల్చారు. అందుకే వాటికి సంబంధించిన వాటిని సేకరించాలని చూస్తున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ చుట్టు ఆయన చేసిన అక్రమాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. అటు కాళేశ్వరం, ఇటు ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన విషయంలో కూడా పలు ఆరోపణలు రావడంతో విచారణ ముమ్మరం అయింది. ఈనేపథ్యంలో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు.