JAISW News Telugu

Kashmir : కాశ్మీర్ లో వలస కార్మికులపై మరోసారి ఉగ్రదాడి.. ఒకరికి తీవ్రగాయాలు

FacebookXLinkedinWhatsapp
Kashmir

Kashmir

Kashmir : కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. వలస కార్మికుడిపై కాల్పులు జరిపారు. గురువారం (అక్టోబరు 24) దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన కార్మికుడిని తుపాకీ కాల్చారు. బాధితుడిని బజ్నోర్ కు చెందిన శుభం కుమార్ గా గుర్తించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో శుభం చేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గతవారం రోజుల్లో కాశ్మీర్ లో స్థానికేతర కార్మికులపై జరిగిన మూడో దాడి ఇది. ఆదివారం గందర్ బల్ జిల్లాలో నిర్మాణ స్థలంలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఓ డాక్టర్ మృతి చెందారు. ఎం4 కార్బైన్, ఏకే 47తో ఆయుధాలు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు సెంట్రల్ కాశ్మీర్ లోని గందరబల్ జిల్లాలోని కార్మికుల శిబిరంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియోలు కూడా వెలువడ్డాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మృతి చెందారు.

Exit mobile version