Janasena : జనసేనకు మరో టెన్షన్..ముందే మేల్కోకపోతే నష్టమే

Janasena

Janasena

Janasena : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి.  జాతీయ, ప్రాంతీయ పార్టీల గుర్తింపు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో వాటి ఆధారంగా అవి ప్రచారం చేసుకుంటున్నాయి. వైసీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు, జనసేనకు గాజు గ్లాసు గుర్తులు కేటాయించింది. దీంతో పార్టీలు తమ గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.

దీంతో జనసేనకు కేటాయించిన గుర్తుపై వైసీపీ కామెంట్లు చేస్తోంది. దీనికి జనసేన కూడా తగిన విధంగానే కౌంటర్లు ఇస్తోంది. గాజు గ్లాస్ పగిలి పనికి రాకుండా పోతుందని సెటైర్లు వేస్తోంది. ఆ గాజు పెంకులే గుచ్చుకుంటే రక్తం కారడం ఖాయమని జనసేన చెబుతోంది. ఇలా ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ వార్ జరుగుతోంది. పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పవన్ కల్యాణ్ తన రాబోయే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఈ సింబల్ ను ప్రమోట్ చేసుకుంటున్నారు. దీంతో వైసీపీకి ఎక్కడో కాలుతోంది. అందుకే జనసేనపై తనదైన శైలిలో చేస్తున్న కామెంట్లను వారు కూడా తిప్పి కొడుతున్నారు. గాజు గుర్తుకు సంబంధించి న్యాయ నిపుణులతో పవన్ కల్యాణ్ చర్చిస్తున్నారు. దీనిపై నేతల్లో కొంత టెన్షన్ మొదలైంది.

ఇంకా కొన్ని చోట్ల జనసేన పోటీలో లేని ప్రాంతాల్లో గాజు గ్లాస్ గుర్తును స్వతంత్రులకు కూడా కేటాయించనున్నారని తెలుస్తోంది. దీనిపై జనసేన ఆందోళన పడుతోంది. ఇలా అయితే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉంటాయని వాపోతోంది. తమ గుర్తు తమకే ఉండాలని ఇతరులకు ఇవ్వొద్దనే వాదన తెస్తోంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరనున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశమున్నందున ముందే మేల్కోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే గాజు సింబల్ జనాల్లోకి బాగా వెళ్లింది. ఈ గుర్తు ఇతరులకు కేటాయిస్తే జనసేనకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.

TAGS