Vijayasai Reddy : వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి vమరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది.
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
గత కొంతకాలంగా రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమ మద్యం విక్రయాలు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి. సిట్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది. విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం ఈ దర్యాప్తులో ఒక ముఖ్యమైన పరిణామంగా చూడవచ్చు.