JAISW News Telugu

MLC Kavitha : కవితకు మరో షాక్.. బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకుంటుందా?

MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha : బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రతి విషయం పార్టీకి నష్టమే తెస్తోంది. అది ఏ కేసైనా బీఆర్ఎస్ పరువు తీస్తోంది. దీంతో చాలా మంది నేతలు పార్టీని వీడుతున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఆరూరి రమేశ్ తో పాటు చాలా మందే పార్టీని వీడారు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం పెరుగుతోంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. పలుమార్లు ప్రశ్నించింది. ఇటీవల కవితను విచారించేందుకు సీబీఐకి సుప్రీం కోర్టు అనుమతించింది. దీంతో సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వేళ  ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

అటు ఈడీ ఇటు సీబీఐ ఆధ్వర్యంలో ఢిల్లీ మద్యం కేసు విచారణ ప్రారంభం కానుంది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టు కావడంతో అందరిని ఒకేసారి విచారణ చేస్తారా? లేక విడివిడిగా చేస్తారో తెలియడం లేదు ఈనేపథ్యంలో మద్యం కేసు, మనీలాండరింగ్ కేసుల్లో కవితను విచారించేందుకు రెడీ అవుతున్నారు. సీబీఐ విచారణలో ఏం తేలుతుందో చూడాల్సిందే.

బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ లిక్కర్ కేసు ప్రతిబంధకంగా మారింది. కవిత జైలుకు వెళ్లడంతో చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ అంధకారంగా మారనుందనే వాదనలు వస్తున్నాయి. ఇంకా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటోంది. దీంతో బీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారింది. చాలా మంది నేతలు పార్టీని వీడి వెళ్లాలని చూస్తున్నారు.

కవిత అరెస్టుతో రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇక బీఆర్ఎస్ కు అన్ని గడ్డు రోజులే అంటున్నారు. బీఆర్ఎస్ కు చేదు అనుభవాలు ఎదురవుతున్న క్రమంలోనే నేతలు పార్టీని వీడుతున్నారు. ఇంకా కొందరు అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు రేగుతోంది.

Exit mobile version