MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కవితపై దాఖలైన ఛార్జిషీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే జూన్ 3న ఛార్జిషీట్ లో పేర్కొన్న నిందితులు అందరూ కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో వచ్చే నెల 3న కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకుని ఇందులో నిందితులుగా ఉన్న వారందరిని విచారణకు పిలవడం హాట్ టాపిక్ గా మారింది.