JAISW News Telugu

YCP : ఎన్నికల వేళ వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. పార్టీ మారనున్న ఎంపీ?

YCP MP

YCP

YCP : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటు వైసీపీ, అటు టీడీపీ కూటమి దూకుడుగా ముందుకెళ్తున్నాయి. ఈక్రమంలో వైసీపీ ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటించగా కూటమి పార్టీలు కూడా అభ్యర్థుల ప్రకటనను వేగంగా పూర్తి చేసి ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీల్లో సీటు రాని అసంతృప్తులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అయితే అధికార వైసీపీలో వెళ్లేవారు కరువైనా.. ఆ పార్టీ నుంచే ఇప్పటికే చాలా మంది టీడీపీ, జనసేన పార్టీల్లోకి తరలివెళ్లారు.

వైసీపీలో సీటు రాని వారికి అక్కడ అవకాశాలు లేకపోవడంతో కూటమి పార్టీలపై ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే ఏదో ఒక పార్టీ అభ్యర్థిగా ఉంటేనే ప్రయోజనముంటుందని నమ్మి ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఈక్రమంలో పలువురు టీడీపీ, జనసేనలో చేరి సీట్లు కూడా సంపాదించుకున్నారు. ఇక ఈ పార్టీల్లో కూడా దాదాపు అభ్యర్థుల ప్రకటన ముగింపు దశకు చేరుకోవడంతో ఇప్పుడంతా బీజేపీ వైపు చూస్తున్నారు.

ఈనేపథ్యంలో వైసీపీకి చెందిన అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధ, ఆమె భర్త తాళ్ల సత్యనారాయణ మూర్తి బీజేపీలో చేరేందుకు రంగం చేసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా మూర్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. అమలాపురం ఎంపీ లేదా పి.గన్నవరం అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించలేదు. మర్యాదపూర్వకంగా కలిశామని వెల్లడించారు. కాగా, వైసీపీలో అనురాధకు సీటు రాని విషయం తెలిసిందే. దీంతో ఆమె బీజేపీ నుంచి చాన్స్ వస్తే పోటీ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

Exit mobile version