T20 World Cup 2024 : గ్రూప్ సీ మ్యాచ్‌లో పపువా న్యూ గినియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించి ఆఫ్ఘనిస్తాన్ సూపర్-8 టికెట్‌ను ఖాయం చేసుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్ జట్టు ఎలిమినేట్ కాక తప్పలేదు. గ్రూప్ సీ నుంచి సూపర్ 8కి చేరిన రెండు జట్లు ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్. ఈ రెండు జట్లు మూడు చొప్పున మ్యాచ్ లు ఆడి విజయం సాధించాయి. ఈ రెండు జట్లు చివరి మ్యాచ్ జూన్ 18న ఆడనున్నాయి. గ్రూప్ సీలో ఏ జట్టు అగ్రస్థానంలో ఉంటుందో ఈ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ 6-6 పాయింట్లతో సమంగా ఉన్నాయి. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా వెస్టిండీస్ కంటే ఆఫ్ఘనిస్థాన్ ముందుంది.
పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా జట్టు 19.5 ఓవర్లలో 95 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ 2024లో మూడు మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్థాన్ తన ప్రత్యర్థి జట్టును 100 పరుగులకే పరిమితం చేయడం ఇది మూడోసారి. అంతకుముందు ఉగాండా 58 పరుగులకు మించి, న్యూజిలాండ్ 75 పరుగులకు మించి స్కోర్ చేయలేదు.
పపువా న్యూ గినియా నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ తొలి 29 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా విజయం సాధించింది.
రషీద్ ఖాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ హ్యాట్రిక్ విజయాలు సాధించి సూపర్-8 లో బెర్త్ ఖరారు చేసుకుంది. లీగ్ దశలోని 29వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 7 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియాను ఓడించింది. ఆఫ్ఘనిస్థాన్ ఈ విజయంతో న్యూజిలాండ్ పై దెబ్బపడింది. కేన్ విలియమ్సన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ ఓడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు వెస్టిండీస్ గ్రూప్ సీ నుంచి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించాయి.
వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయన నాలుగో జట్టు ఆఫ్ఘనిస్థాన్ విజయంతో న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ 2024 నుంచి నిష్క్రమించిన నాలుగో జట్టు. అంతకు ముందు నమీబియా, ఒమన్, శ్రీలంక వరల్డ్ కప్ నుంచి నిష్ర్కమించాయి.