producer affair : రంగుల ప్రపంచం అంటే మామూలుది కాదు. ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో అంతే పాతాళానికి తొక్కేస్తుంది. జాగ్రత్తగా ఉన్నామా సరే.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పాతాళంలో పడిపోవాల్సిందే. కాస్టింగ్ కౌచ్ కు బలైపోయిన యువతులు ఉన్నారు. యువతుల వలపు వలలో పడిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఛేంజ్ కాస్టింగ్ కౌచ్ కు ఒప్పుకుంటే సినిమాలో వేశం దొరుకుతుంది. అదే ఒక నటి ఇబ్బంది పెట్టాలనుకుంటే సొరంగంలో ఉన్నా ఏ డిపార్ట్ మెంట్ వ్యక్తి అయినా బయటకు రావాల్సిందే.
సినిమా రంగంలో చిలక్కొట్టుళ్లు ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. అ మధ్య ఓ నిర్మాత ఒక నటి వలపుల వలలో చిక్కుకున్నాడు. ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్లిందంటే డీఎన్ఏ టెస్ట్ వరకు వెళ్లింది. అఖరికి ఏదో ఒక సెటిల్ మెంట్ తో సద్దుమణిగింది. లెటెస్ట్ గా ఒక నిర్మాత వలపుల వలలో చిక్కుకొని, బయట పడినట్లు తెలుస్తోంది.
విషయం ఏంటంటే అయన ఒక బిజినెస్ మన్. కానీ ఏదో కాస్త ఫన్ కోసం ఇండస్ట్రీలోకి నిర్మాతగా వచ్చారు ఒక సినిమా కూడా చేశారు. మరో సినిమా ఆయన నిర్మాణంలో నడుస్తోంది. ఈ టైమ్ లో ప్రొడక్షన్ లోని ఒక అమ్మడితో స్నేహం ఏర్పడింది. ఇలాంటి స్నేహాలను చిగురింప చేసుకోవడంలో అమె దిట్టని ఇండస్ట్రీకి తెలిసినా పాపం కొత్త నిర్మాత కాబట్టి ఆయనకు తెలియదు.
ఆ నిర్మాత సదరు యువతి ముగ్గులోకి దిగిపోయాడు. కొన్ని రోజులు బాగానే ఉంది. తర్వాత అసలు కథ మొదలైంది. ఇబ్బంది దిశగా వ్యవహారం ముదరడం మొదలైంది. తెలివిగా ఎలా సెటిల్ చేసుకోవాలో అలా సెటిల్ చేసుకొని బయటపడ్డారు. అవతల కూడా తెగేదాకా లాగే వ్యవహారం కాదు. అందుకే సెటిల్ మెంట్ అంటే హ్యాపీగా ఒప్పుకుంది. ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారు.