JAISW News Telugu

New Scheme : ఆగస్టు 15 నుంచి మరో కొత్త పథకం.. ఆ బాధితులకు ఎంతో ప్రయోజనం

New Scheme

New Scheme

New Scheme : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పాలన గాడీలో పడింది. జగన్ అరాచక పాలనలో అతలాకుతలమైన రాష్ట్రాన్ని సరైన దిశగా సీఎం చంద్రబాబు తీసుకెళ్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతోనే మొన్నట బడ్జెట్ లో ఏపీలో ప్రాధాన్యం దక్కింది. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఇతర మౌలిక సదుపాయాలు, వెనకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధులు కేటాయించారు. ఇదంతా కూటమి వల్లే సాధ్యమైంది. దీంతో కేంద్ర తోడ్పాటుతో ఈ ఐదు సంవత్సరాల్లో ఏపీని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించేందుకు చంద్రబాబు నాయుడు పూనుకున్నారు.

రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి నేత చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగానే ప్రస్తుతం పాలన సాగిస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కొత్త పథకాలను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల కోసం సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకొచ్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో క్యాన్సర్ రోగులకు రూ.680 కోట్లు వెచ్చించి వైద్యసేవలు అందిస్తున్నట్టు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు.

ఈ పథకం వల్ల క్యాన్సర్ వ్యాధి బాధితులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. క్యాన్సర్ వస్తే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పేదలకు ఆరోగ్య భరోసాను ఈ కార్యక్రమం అందించనుంది. సర్కార్ అండతో బాధితులు క్యాన్సర్ బారి నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది.

Exit mobile version