JAISW News Telugu

New Railway Line : తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?

New Railway Line

New Railway Line

New Railway Line  : మోడీ ప్రభుత్వం రవాణాపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రోడ్డు, రైల్ ట్రాన్స్ పోర్ట్ ను పెంచుతోంది. 2014కు ముందు కంటే దేశంలో ఇప్పుడు రోడ్డు మార్గం డబుల్ పెరిగింది. ఇదే స్థాయిలో రైల్వే కూడా పెరుగుతోంది.

అయితే, తెలంగాణ ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో శుభవార్త తీసుకువచ్చింది. అందేంటేంటే.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్తోంది. డోర్నకల్-గద్వాల మధ్య ఈ రైల్వే ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలను ఈ లైన్ కలుపుతుంది. ప్రస్తుతం సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సర్వే ప్రస్తుతం నల్గొండ జిల్లా మోతె మండలంలో జరుగుతోంది. డోర్నకల్‌ నుంచి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం, నాయకన్‌గూడెం మీదుగా మోతె మండలం కొత్తగూడెం మీదుగా పనులు కొనసాగుతున్నాయి.

కొత్తగూడెం, తుమ్మలపల్లి గ్రామాల వద్ద రోడ్డు పాసింగ్ గుర్తించి మార్కింగ్ చేశారు. ఫైనల్ సర్వే కోసం రూ.7.40 కోట్లను గతేడాదే మంజూరు చేశారు. డోర్నకల్-గద్వాల 296 కిలో మీటర్లు ఉంటుంది. నిర్మాణ వ్యయం రూ.5330 కోట్లు. ఇది పూర్తయితే సౌత్ సెంట్రల్ లో రైల్వే నెట్ వర్క్ మరింత విస్తరిస్తుంది. కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, నాంపల్లి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి వంటి ప్రధాన ప్రాంతాలను ఈ మార్గం కలపుతుంది.

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2 సార్లు రైల్వేలకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారు. ఖర్చు తక్కువ, సురక్షిత ప్రయాణం కావడంతో ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. అమృత్ భారత్ పేరిట స్టేషన్లను ఆధునికీకరిస్తుండడంతోపాటు కొత్త రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోజు రోజుకు ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడం, అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో డోర్నకల్-గద్వాల్ మధ్య కొత్త లైను అందుబాటులోకి రాబోతోంది.

Exit mobile version