Monkeypox cases : కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదయింది. దీంతో భారత్ లో ఈ కేసుల సంఖ్య మూడుకు చేరింది. కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైనట్లుగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపించగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
భారత్ లో సెప్టెంబరు 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదయింది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలు పరీక్షించగా అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్-2 రకంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. అనంతరం యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు సెప్టెంబరు 18న కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది.