YCP MP Candidates : వైసీపీ మరో జాబితా..గుంటూరు, ఒంగోలు ఎంపీ అభ్యర్థులు వీరే..
YCP MP Candidates : ఏపీలో మరో నెలన్నరలో ఎన్నికలు ఉండడంతో సర్వత్రా రాజకీయ సందడి నెలకొంది. పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుల లెక్క తేల్చుకున్నాయి. నిన్న బహిరంగ సభ కూడా నిర్వహించాయి. ఇక వైసీపీ ఇప్పటికే పలు జాబితాల ద్వారా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన 8వ జాబితాను విడుదల చేసింది.
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. ఆ జాబితాను పరిశీలిస్తే..
1. గుంటూరు ఎంపీ: కిలారు రోశయ్య
2. పొన్నూరు : అంబటి మురళి
3. ఒంగోలు ఎంపీ : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
4. కందుకూరు : బుర్రా మధుసూదన్ యాదవ్
5. జి.డి. నెల్లూరు : కల్లత్తూర్ కృపాలక్ష్మి
‘‘మొత్తం 175 సీట్లకు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరం అవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం జగన్ పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపొటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు, చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేయాలని వైసీపీ భావిస్తోంది. ఈక్రమంలో ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి, ప్రచార బరిలో ముందుండాలని వ్యూహం రచించింది. అయితే ఆ పార్టీ హైకమాండ్ ఆశిస్తున్నట్టు అభ్యర్థుల మార్పు కలిసివస్తుందా? శ్రేణులు ఎలా రిసీవ్ చేసుకుంటాయి? కొత్త అభ్యర్థులకు జనాలు ఓట్లు వేస్తారా? టీడీపీ, జనసేన పొత్తు ఏమేరకు ప్రభావం చూపుతుంది అనేది ఎన్నికల ఫలితాల రోజే తెలియనుంది.