JAISW News Telugu

Jagan : బయటపడ్డ జగన్ మరో భారీ కుంభకోణం.. ఆదానితో అంటకాగి మరీ జనం డబ్బులు ఎలా దోచుకున్నారంటే?

Jagan

Jagan

Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రోజు రోజుకు ఒక్కో కుంభకోణం బయట పడుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో తాడేపల్లి స్కాంతో పాటు భారీ స్కాంలు బయటపడ్డాయి. వీటిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు నిలదీయడంతో ప్రతిపక్ష హోదా సాకుతో అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు మరో స్కాం బయటకు వచ్చింది. ఇదేదో ఏపీ పోలీసులు, ఇండియా పోలీసులు వెలికి తీసింది కాదు. అమెరికా పోలీసులు బయటపెట్టింది.

గతంలో గౌతమ్ ఆదాని తన ప్రైవేట్ విమానంలో విజయవాడకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను కలవడం, విందు భోజనాలు చేశాడు. పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ దీని వెనుక భారీ స్కాం ఉందని అర్థమైంది. ఆదాని దాదాపు రూ. 2వేల కోట్లకు పైగా  జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వం అక్కడి కోర్టులో కేసు వేసింది. 7,000 మెగావాట్ల విద్యుత్ అధిక ధరలకు కొనుగోలు చేసేందుకు జగన్ ప్రభుత్వం అంగీకరించింది. ఆదాని వద్ద అధిక ధరలకు పవర్ కొనేది లేదని దేశంలో ఇతర రాష్ట్రాలు చేతులెత్తేస్తే.. రూ. 2వేల కోట్లు లంచంగా ఇస్తే నేను కొంటానని అదానీతో ఒప్పందం చేసుకున్నట్లు ఈ ఛార్జి షీట్ చూస్తే అర్థం అవుతోంది.

అమెరికా అధికారుల ఆరోపణల ప్రకారం.. 7,000 మెగా వాట్లకు గానూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెగావాట్ కు రూ. 25 లక్షల చొప్పున రూ. 1750 కోట్లు లంచం తీసుకున్నాడని న్యూ యార్క్ కోర్టులో దావా వేసింది.

Exit mobile version