Gattamaneni Sitara : వెండితెరపైకి మరో వారసురాలు.. ఎంట్రీ ఎప్పుడు అంటే!

Gattamaneni Sitara

Mahesh Babu Daughter Gattamaneni Sitara

Gattamaneni Sitara : టాలెంట్ ఉండాలే కాని వారసత్వంతో పనేముంది. వారసత్వంగా వచ్చిన హీరోలు, హీరోయిన్లు, నటులే ఇండస్ట్రీకి కీర్తి తెచ్చిపెట్టారు. బాలయ్య బాబు, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబుతో పాటు యంగ్ స్టార్లు రామ్ చరణ్, యంగ్ టైగర్, వరుణ్ తేజ్, ప్రభాస్ లాంటి వారు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే హీరోయిన్లలో ఈ సంఖ్య కొంత తక్కువగానే ఉందని చెప్పవచ్చు. దాదాపు ఒకటి రెండు సినిమాలకే వారు పరిమితం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో మరో తార ఇండస్ట్రీకి రాబోతోందని టాలీవుడ్ సర్కిల్ లో తీవ్రంగా  చర్చ జరగుతోంది. ఆమె ఎవరో కాదు మహేశ్ బాబు కూతురు.. సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు ఘట్టమనేని సితార. ఆమె ఎంట్రీ కోసం మహేశ్ ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారట.

సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత కూతురు సితార. ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మహేష్ బాబుకు కొడుకు గౌతమ్ ఉన్నా సెలబ్రిటీ స్టేటస్ మొత్తం సితారనే దక్కించుకుంటుంది. పోస్టులు పెట్టడం, సంఘ సేవ, డ్యాన్స్ లు వేయడం, ఫోటో షూట్స్ తో సితార అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

పదేళ్లకే ఇంటర్నేషనల్ జ్యువలరీకి సంబంధించి యాడ్ లో నటించి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఆ యాడ్ వల్ల వచ్చిన డబ్బును డొనేట్ చేసి వారెవ్వా అనిపించుకుంది. అందంతో పాటు వ్యక్తిత్వం ఉన్న ఈ చిన్నదానికి ఇండస్ట్రీలో తిరుగులేదు అనుకున్నారు. 11 ఏళ్లకే సితార.. హీరోయిన్లను మించిన అందంతో యాడ్స్ లలో మెరిసిపోతోంది. ఒక పక్క డాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క చదువులో కూడా బ్రిలియంట్ గా ఉంది.

ఇక సోషల్ మీడియాలో చిన్నదాని హంగామా మామూలుగా ఉండదు. తండ్రితో షోస్ కు వస్తూనే.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన స్థాయిని పెంచుకుంటుంది. తానుకూడా తాత, తల్లిదండ్రులుగానే హీరోయిన్ కావాలని అనుకుంటున్నట్లు ఎప్పుడో చెప్పింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సితార డెబ్యూను హాలీవుడ్ నుంచి ఉండాలని ప్లాన్ చేస్తుందట.

ఈ విషయాన్ని సితారనే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ‘చిన్ననాటి నుంచి నాన్నను చూసి పెరగడం వల్ల సినిమాలంటే ఆస‌క్తి క‌లిగింది. సినిమాల్లోకి రావాల‌ని ఉంది. అయితే ఇంగ్లిష్ సినిమాల్లోనే న‌టించాల‌నుకుంటున్నా’ అంటూ చెప్పింది. దీంతో సితార.. టాలీవుడ్, బాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశం లేదని తెలుస్తుంది. తన కెరీర్ గురించి మంచి క్లారిటీతో ఉన్నట్లు అర్థమవుతుంది.

ఇక హాలీవుడ్ లో తెలుగమ్మాయిలు చాలా తక్కువ అనేకంటే లేరని చెప్పవచ్చు. ఈ మధ్యే అవంతిక వందనపు హాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ కూడా ప్రసంసిస్తున్న విషయం తెల్సిందే. తెలుగువారు కూడా హాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సితార హాలీవుడ్ వైపు తొంగిచూడడం తప్పు కాదన్న మాటలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు తలుచుకుంటే.. సితార హాలీవుడ్ ఎంట్రీ ఎంతసేపు అని టాక్. మరి సితార హాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో చూడాలి.

TAGS