Hyderabad : హైదరాబాద్ మెడలో మరో మణిహారం..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో ‘టీ స్క్వేర్’

Hyderabad

Hyderabad

Hyderabad : దేశంలోనే కొత్త రాష్ట్రం తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. అన్ని రంగాల్లో అగ్ర రాష్ట్రాలతో పోటీ పడుతోంది. దీనికి ముఖ్య కారణం రాజధాని హైదరాబాద్ అని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణ ఆదాయంలో ప్రధాన వాటా హైదరాబాద్ మహానగరానిదే. రాష్ట్రంలోని జనాభాలో మూడింట ఒక వంతు ఇక్కడే ఉంది. ఇక హైదరాబాద్ దేశంలోనే ఐదో అతిపెద్ద నగరం. నిత్యం లక్షలాది మంది రాష్ట్ర ప్రజలే కాక దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో పాలకులు హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల నుంచి మొదలు కేసీఆర్ వరకు అందరూ హైదరాబాద్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇక తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పై తమదైన ముద్ర ఉండాలని యోచిస్తున్నారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తమ పాలనకు గుర్తుగా మిగిలేలా ఓ ఐకానిక్ కట్టడాన్ని నిర్మించాలని భావిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్ లో ‘టీ స్క్వేర్’ నిర్మించాలని డిసైడ్ అయ్యింది. ఇది హైదరాబాద్ సిగలో మరో ఐకానిక్ ల్యాండ్ మార్క్ అవుతుందని అంటున్నారు.

దీని కోసం కాంగ్రెస్ సర్కార్ టెండర్లు కూడా పిలిచింది. ఆకాశన్నంటే బిల్డింగ్ లు, అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలకు నెలవైన రాయదుర్గం, బయో డైవర్సిటీ ప్రాంతాల్లో టీ స్క్వేర్ నిర్మించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం తెలంగాణ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ ప్రాంతాన్ని పెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలని సీఎం ఆలోచిస్తున్నారు. టీ స్క్వేర్ నిర్మాణంతో రాయదుర్గం వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

TAGS