NRI Missing : వర్జీనియాలో మరో ప్రవాస భారతీయుడు మిస్సింగ్.. కంగారు పడుతున్న తల్లిదండ్రులు..

NRI Missing

NRI Missing

NRI Missing : అమెరికాలో భారతీయులు అదృశ్యం కావడం, రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, హత్యలకు గురవడం చాలా వరకు ప్రవాసులను కలవరపెడుతోంది. ఈ ఘటనలు నెలలో ఒకటి, రెండు నమోదవుతుండడంతో అక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ ఉండవద్దిని, వెంటనే ఇక్కడకు రావాలని కోరుతున్నారు.

అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన పృథ్వీ మృతి చెందినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన మరో విషాదకర ఘటన వెలుగు చూసింది.

25 సంవత్సరాల ఓం అరవింద్ అదృశ్యం అయ్యాడని, అతని ఆచూకీ కోసం ఫెయిర్ ఫాక్స్ కౌంటీ పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓం అరవింద్ చివరిసారిగా మే 5వ తేదీ ఉదయం 11 గంటలకు మనస్సాస్ లోని సెంటర్ విల్లే రోడ్ లోని 7200 బ్లాక్ నుంచి బయటకు వచ్చాడు. 5.50 గంటలకు 120 ఎల్బీఎస్, బీఎల్కె జుట్టు, బ్రో కళ్లు, నీలం చొక్కా, టాన్ షార్ట్స్, బీఎల్కె షూస్ & గ్లాసెస్ ధరించాడు. అతని ఆచూకి లభిస్తే 703-691-2131 కు కాల్ చేయండని పత్రికా ప్రకటన రిలీజ్ చేసినట్లు ఫెయిర్ ఫాక్స్ కౌంటీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. భారత సంతతికి చెందిన ఈ వ్యక్తి ఆచూకీ కనుగొనడంతో దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

ఇండియాలో ఉన్న ఓం అరవింద్ తల్లిదండ్రులు తన కొడుకు జాడ చెప్పాలని భారత ఎంబసీని కోరింది. ఎంబసీ కూడా అమెరికాలో ఓం అరవింద్ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు చెప్తోంది.

TAGS