Zika Virus : మరో మహమ్మారి.. ప్రజలకు కేంద్రం హెచ్చరిక
Zika Virus : ప్రతీ సీజన్ లో ఏదో ఒక మహమ్మారి దేశ ప్రజలను భయపెడుతూ వస్తోంది. తాజాగా జికా వైరస్ వ్యాప్తి ఇప్పుడు గుబులు రేపుతోంది. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు జికా వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చిరికలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో జికా కేసులు పెరుగుతుండడంతో హాస్పిటల్స్ లో నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం దిశా నిర్ధేశం చేసింది. పాజిటివ్ కేసులు పెరగకుండా జనావాస ప్రాంతాలు, ఆఫీసులు, స్కూల్స్, నిర్మాణ స్థలాల్లో వైరస్ ను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.
జికా దండయాత్ర..
సీజన్ లో వచ్చే జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భారత్ లో కరోనా పీడ వదలిందనుకుంటున్న సమయంలో జికా విజృంభించడం మొదలు పెట్టింది. మహారాష్ట్రలో జికా పాజిటివ్ కేసులు లెక్కకు మించి పెరుగుతుండడంతో కేంద్రం అలర్ట్ అయింది. మహారాష్ట్రతో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని.. కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది.
రాష్ట్రాలకు వార్నింగ్..
దోమల ద్వారా సంక్రమించే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమని కేంద్రం హెచ్చిరస్తోంది. అందుకే జికా వ్యాప్తి రాష్ట్రాల్లో జిల్లాకో నోడల్ అధికారిని నియమించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది. దోమలు లేకుండా, వైరస్ బారిన పడకుండా ఇళ్లు, నివాస ప్రాంతాలు, ఆఫీసులు, నిర్మాణాలు చేపడుతున్న ప్రదేశాలపై నిఘా పెంచాలని కేంద్రం సూచిస్తోంది.
చాపకింద నీరులా..
24 గంటల క్రితం 8జికా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. అలాగే పూణె, కొల్లాపూర్, సంగమేశ్వర్ లో కూడా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం ఢిల్లీ, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది.