JAISW News Telugu

Earthquake : మయన్మార్‌లో మరోసారి భూకంపం

Earthquake : వరుస భూకంపాలతో మయన్మార్ వణికిపోతోంది. ఇవాళ ఉదయం దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైంది. కాగా ఇటీవల సంభవించిన భారీ భూకంపంతో మయన్మార్‌ అతలాకుతలం అయింది. 3వేల మందికి పైగా మరణించారు. శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతోంది. రూ.వేల కోట్ల ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఆ తర్వాత కూడా తరచూ భూకంపాలు వస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

Exit mobile version