Disaster for Earth : భూమికి మరో విపత్తు తప్పదా? సైబీరియాలో పెద్ద గుంతలు ఏర్పడడానికి కారణాలేంటి?
ఇక కాలం అంతం కాబోతుందంటూ వార్తలు వినిపిస్తుంటాయి. ఇవి చాలా వరకు అబద్ధాలు అయినప్పటికీ కొంతవరకు నిజం లేకపోలేదు. భూమి ఒక గ్రహం కాగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యలో అనేక పరిణామాలు ఏర్పడుతుంటాయి. ఆస్ట్రరాయిడ్స్ చాలా సార్లు వచ్చి భూమిని ఢీకొనే అవకాశం ఉందనే సైంటిస్టులు చెబుతుంటారు. కొన్నింటిని తప్పించామని దీని కోసం రిస్క్ చేశామని వెల్లడిస్తూ ఉంటారు.
భూమిపై సైబీరియా ప్రాంతం ప్రస్తుతం అత్యంత చలి ప్రదేశంగా ఉంది. ఇక్కడ అనేక పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇవి ఎలా ఏర్పడుతున్నాయో ఎవరికీ అంతుపట్టడం లేదు. వీటినే రష్యాలో వీటిని క్రేటర్లు అంటారు. అంటే బుల్గాస్ అని అర్థం. భూగర్భ సైంటిస్టులు ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇలా గుంతలు ఏర్పడటం వల్ల భూమికి ఏదైనా విపత్తు రాబోతుందా అనే అంశంపై పరిశీలన జరుపుతున్నారు.
సైబీరియా సాధారణంగా మంచు ప్రదేశం. ఇక్కడ భూమి లోపల ఉండే ఒక పొర కరగడం వల్ల ఇలా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఉష్ణోగ్రత పెరిగి మంచు కరిగినపుడు ఇలా గుంతలు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాశ్వతంగా ఉండిపోవాల్సిన మంచు కరిగిపోయినపుడు ఇలా భూమిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వాయువులు ఒత్తిడితో పెద్ద గుంతలు ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఇప్పటికైనా పర్యావరణాన్ని కాపాడాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. లేకపోతే రాబోయే మానవ జీవనానికి మహా ప్రళయం తప్పదని హెచ్చరిస్తున్నారు.