JAISW News Telugu

Netflix : నెట్ ఫ్లిక్స్ లో మరో నిరాశజనక వెబ్ సిరీస్.. కథ బాగానే ఉన్నా తగ్గుతున్న వ్యూవర్స్ కారణం ఏంటి?

Netflix

Netflix

Netflix : నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల రిలీజ్ అయిన ‘త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్’ రిలీజైంది. గిగోలోగా చూపించేందుకు డైరెక్టర్ ప్రయత్నం చేశాడు. మీర్జాపూర్ సృష్టికర్త పునీత్ మిశ్రా రూపొందించిన ఈ బోల్డ్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్ అరుదుగా కనిపించే సరికొత్త ఆలోచనను చూపించింది. వినూత్న కోణం ఉన్నప్పటికీ, ఈ సిరీస్ వ్యూవర్స్ ను ఆకట్టుకునేందుకు చాలా కష్టపడుతోంది.

నోయిడా కేంద్రంగా సాగే ఈ సిరీస్ లో త్రిభువన్ సిఏ కావాలని కలలు కంటాడు. అతనికి వచ్చే సెక్స్, కోరికల ఇతివృత్తాలను సాంస్కృతిక, సామాజిక కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. కానీ అదే సిరీస్ ను దెబ్బ తీసింది. అసంబద్ధమైన వ్యంగ్యం, సాంఘిక నాటకాల మేళవింపుతో ఈ సిరీస్ జనాలను ఆకట్టుకోలేకపోయింది.

మానవ్ కౌల్ తో పాటు మంచి తారాగణం తీసుకున్నప్పటికీ తిలోత్తమ షోమ్ అస్థిరమైన రచనతో మరో కోణంలో సిరీస్ వెళ్లింది. ఈ సిరీస్ మీర్జాపూర్ తరహాలోనే లాంగ్వేజ్ తో ఉంటుంది. ఇది కొంత వినోదాత్మకంగా సాగినా.. దీని వల్ల కథలోని సూక్ష్మమైన అంశాలను కనుమరుగు చేస్తుంది.

శుభ్రజ్యోతి బారత్, శ్వేతాబసు ప్రసాద్ సహా సహాయక నటీనటులు ఉత్తమ నటననే ప్రదర్శించారు. కానీ సిరీస్ మాత్రం పేలవంగా సాగింది. అత్యంత ముఖ్యమైన సమస్యల్లో ఒకటి సిరీస్ నిడివి. 9 గంటల పాటు సాగుతూ బోర్ ఫీల్ తెస్తుంది. అనవసరమైన రియాక్షన్ షాట్లు, సైడ్ సైక్ సరదాల కారణంగా ఎపిసోడ్లు డ్రాగ్ అవడంతో మందకొడిగా సాగుతుంది. క్రిస్ప్ ఎడిటింగ్ లేకపోవడం, సౌండ్ ట్రాక్ సరిగా లేకపోవడంతో వ్యూవర్స్ కు సిరీస్ అనుభవాన్ని దూరం చేసింది.

‘చివరకు త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్’ కుప్పకూలింది. అద్భుతంగా ఉండాల్సిన సిరీస్ నిరాశాజనకంగా సాగుతుంది. మూల కథ బాగానే ఉన్నా.. ఈ సిరీస్ తన రూట్ ను కోల్పోతుంది, గందరగోళం, సంతృప్తికరమైన ముగింపుతో ప్రేక్షకులు నిరాశ, నిష్పృహలతో ఉంటారు.

Exit mobile version