YouTuber Harsha Sai : యూట్యూబర్ హర్ష సాయిపై మరో కేసు నమోదు

YouTuber Harsha Sai
YouTuber Harsha Sai : యూట్యూబర్ హర్ష సాయిపై మరో కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగా యూట్యూబర్ సాయి వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. కాగా ఇప్పటికే ఓ యువతి తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు రూ.2 కోట్లు తీసుకొని మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలే హర్షసాయిపై మరో కేసు నమోదైంది. తనపై ఆన్ లైన్ ట్రోలింగ్ కు పాల్పడుతున్నాడని ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ యువతా హైదరాబాద్ లోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అందులో భాగంగా సోషల్ మీడియాలో హర్ష సాయి తన అనుచరులతో కలిసి తనపై నెగెటివ్ ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. అంతేగాకుండా ఈ విషయానికి సంబంధించి పలు స్క్రీన్ షాట్లు కూడా బాధితురాలు పోలీసులకు షేర్ చేసింది. ఈ క్రమంలో తనపై నెగెటివ్ ట్రోలింగ్ కి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి పోలీసులను కోరింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.