Kanna Rao : బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్శర్ రావు అలియాస్ కన్నారావుపై మరో కేసు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. భూ సమస్య పరిష్కారం కోసం ఆయన వద్దకు వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి నందిని అనే మహిళతో కలిసి రూ. 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడని, అంతేగాక అతడిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఓ భూ వివాదంలో కన్నారావును 2020లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విజయ్ కలిశాడు. తల్లిదండ్రలు లేకపోవడంతో విజయ్ ఒంటరిగా జీవిస్తున్నాడు. విజయ్ గురించి పూర్తి వివరాలు సేకరించిన కన్నారావు, భూ వివాదాన్ని పరిష్కరించి దగ్గరుండి పెళ్లి కూడా చేస్తానని హామీ ఇచ్చినట్లు విజయ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా తనను నమ్మించి రూ.60 లక్షలు, 97 తులాల బంగారం దోచేశాడని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే మన్నెగూడ భూవివాదం కేసులో కన్నారావు అరెస్టయిన సంగతి తెలిసిందే.