Bridge Collapsed : బీహార్ లో కూలిన మరో వంతెన.. వారంలోనే రెండోది

Bridge Collapsed
Bridge Collapsed in Bihar : బీహార్ లో మరో వంతెన కూలిపోయింది. సివాన్ లో ఈరోజు (జూన్ 22) ఉదయం మహారాజ్ గ్జ్ జిల్లాలోని పటేధీ బజార్ మార్కెట్ లను దర్బంగాలోని రామగఢ్ పంచాయతీతో కలిపే వంతెన ఒక్కసారిగా కూలింది. ఈ వంతెనపై ప్రతిరోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈరోజు ఉదయం ఒక్కసారిగా భారీ శబ్ధంతో వంతెన కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈ వంతెన సుమారు 40 నుంచి 45 సంత్సరాల క్రితం నిర్మించినట్లు స్థానికులు తెలిపారు.
బీహార్ లోని అరారియా జిల్లాలో బక్రా నదిపై రూ.12 కోట్లతో నిర్మించిన వంతెన జూన్ 18న కూలిపోయిన సంగతి తెలిసిందే. వారం రోజులు కూడా కాకముందే సివాన్ లో ఈరోజు మరో వంతెన కూలడంతో నిర్మాణంలో నాణ్యతా లోపాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.