JAISW News Telugu

RGV Vyuham Movie : వర్మకు మరో దెబ్బ.. పాపం ‘వ్యూహం’ మారేలా ఉందే!

FacebookXLinkedinWhatsapp
RGV Vyuham Movie

RGV Vyuham Movie

RGV Vyuham Movie : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో రామ్ గోపాల్ వర్మ ఒకరు.. టాలెంటెడ్ డైరెక్టరే అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన టాలెంట్ పని చేయడం లేదు. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను అందుకున్న వర్మ ఇప్పుడు దారి తప్పినట్టే అనిపిస్తుంది. ఇతడు హిట్స్ అందుకుంటున్న సమయంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

మరి వారంతా కూడా ఈయన ఇండియాలో గర్వించదగ్గ డైరెక్టర్ అవుతాడు అనుకుంటే ఇప్పుడు బి గ్రేడ్ సినిమా డైరెక్టర్ అని అనిపించు కుంటున్నాడు.. ఏ సినిమా తీసిన అది బి గ్రేడ్ సినిమా లేకుంటే కాంట్రావర్సీలను క్రియేట్ చేసే సినిమా అయి ఉంటుంది.. మరి ఇప్పుడు వర్మ ఫోకస్ మొత్తం రాజకీయాలపై ఉన్న విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే..

దీంతో ఈయన రాజకీయ నేపథ్యంలో సినిమాలు చేస్తూ కాంట్రావర్సీ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. తాజాగా వర్మ నుండి రాబోతున్న మరో మూవీ ”వ్యూహం”.. ఈ సినిమాను ఏపీ రాజకీయాల నేపథ్యంలో తీసినట్టు ఓపెన్ గానే చెప్పాడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల నేపథ్యంలో ఈ సినిమా తీసినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాను వైసీపీకి అనుకూలంగా తీసినట్టు అయితే అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాను నవంబర్ 10న రిలీజ్ చేయనున్నట్టు ముందు నుండి చెబుతూ వచ్చారు.. కానీ ఈ మూవీ సెన్సార్ వరకు వెళ్లి అక్కడే ఆగిపోయింది. దీంతో రిలీజ్ వాయిదా పడక తప్పలేదు..

సెన్సార్ చేసేందుకు నోచుకోక పోవడంతో ఈ సినిమాను డైరెక్ట్ గా ఏపీ ఫైబర్ లో నేరుగా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఏపీ ఫైబర్ నెట్ తో సాటిలైట్ పరంగా కొన్ని సినిమాలు డైరెక్ట్ గా రిలీజ్ చేస్తామని తెలుపుగా ఫైనల్ గా వర్మ సినిమానే ఫైబర్ నెట్ ద్వారా రిలీజ్ అయ్యే సినిమా అయ్యింది..

Exit mobile version