Sharmila VS Jagan : జగన్ తన సోదరి షర్మిలపై ఆస్తి వివాదం కేసు పెట్టడంతో కొన్ని రోజులుగా అన్నా చెల్లెలి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత షర్మిల రాసిన లేఖను టీడీపీ బయటపెట్టింది. ఆస్తుల పంపకం విషయంలో జగన్ తనను ఎలా హింసించారో వివరించారు. అంతే కాదు షర్మిలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వాటిలో ఎక్కువ భాగం వైసీపీ మద్దతుదారులే క్రియేట్ చేస్తున్నారు. జగన్, వైసీపీ అగ్రనేతల అండదండలతోనే తనపై ఆన్ లైన్ ట్రోల్స్ చేయిస్తున్నాడని షర్మిల రోధిస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షర్మిల మాట్లాడుతూ.. తాను ఎవరి కోసం పాదయాత్ర చేశానో, ఏ పార్టీ కోసం కష్టపడ్డానో తన కుటుంబాన్ని వదిలేసి ఇప్పుడు తనను టార్గెట్ చేసి బహిరంగంగా ధూషిస్తున్నారని కన్నీటి పర్యంతమైంది.
తన సోదరుడు జగన్ అనుమతితోనే తనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయని షర్మిల ఆరోపిస్తోంది. ‘సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేయడం వెనుక నా సోదరుడు జగన్, ఆయన భార్య భారతి, సజ్జల, ఆయన కుమారుడు ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా సైన్యాన్ని సృష్టించి ఆ సైన్యం సాయంతో నాపై దాడి చేస్తున్నారు.
తనపై జరుగుతున్న ఈ ట్రోలింగ్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి మద్దతుదారులు ఎవరూ సమర్థించరని షర్మిల అన్నారు. తన తల్లి విజయమ్మను కూడా ట్రోల్ చేసేంత దిగజారిపోయారని ఆమె అన్నారు. పార్టీ కోసం పనిచేసి పాదయాత్ర చేసిన వారి నుంచి తనకు గౌరవం దక్కలేదన్నారు. చాలా రాష్ట్రాల్లో కుటుంబ సభ్యులు వివిధ పార్టీల్లో పనిచేస్తున్నారు.
వారి సిద్ధాంతాలను గౌరవించి పార్టీల్లో చేరుతున్నాం. అలాగని ఒకరితో ఒకరు వ్యక్తి గత వైరం పెట్టుకోవాలని కాదు’ అని ఆమె అన్నారు. తన సోదరుడు ఇలా ప్రవర్తించడం దురదృష్టకరమని, ఆమె తన సొంత సోదరి అనే విషయాన్ని కూడా మరిచిపోయారని షర్మిల అన్నారు.