Mark Shankar : మార్క్ శంకర్ పేరిట అన్నదానం.. రూ. 17 లక్షలు అందించిన పవన్ కల్యాణ్- లెజినోవా దంపతులు


Mark Shankar : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అన్నా లెజినోవా తమ కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద అన్నదానం నిర్వహించారు. ఈ రోజు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో మధ్యాహ్న భోజనం కోసం వారు రూ. 17 లక్షల విరాళం అందజేశారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు అన్న ప్రసాద కేంద్రంలోని డిస్ప్లే బోర్డుపై తెలియజేశారు.

TAGS