Anna canteens : తెరుచుకున్న అన్నా క్యాంటిన్లు.. పేదల ఆకలిని తీర్చిన చంద్రబాబు..

Anna canteens

Anna canteens : చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయని ప్రజలు జేజేలు చెప్తున్నారు. ఐదేళ్ల కష్టాలను అంచెలంచెలుగా తీరుస్తున్నాడని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో అంటే 2014లో పేదలు, ఏదైనా పనిపై సిటీకి వచ్చిన వారి కోసం చంద్రబాబు నాయుడు ‘అన్నా క్యాంటీన్’లను ఏర్పాటు చేశాడు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు రూ. 5, మధ్యాహ్నం భోజనం రూ. 5, రాత్రి బోజనం రూ. 5 అంటే మొత్తం రూ. 15కే ఒక రోజు గడిచేలా ఈ క్యాంటిన్ ఓపెన్ చేశారు. ఇది పేదల ఆకలిని తీర్చింది. ఎంతో మంది పట్టణాలకు వెళ్తున్నప్పుడు అన్నా క్యాంటీన్ ఉందన్న ధీమాతో వెళ్లేవారు.

కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్యాంటిన్లను మూయించివేశాడు. వీటితో పేదల ఆకలి కంటే చంద్రబాబు నాయుడికి గుర్తింపు ఎక్కువ వస్తుందనే అక్కసుతోనే క్యాంటిన్లను మూయించి వేశాడు. ఆ సమయంలో ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు ఏదైనా కోపం ఉంటే తనపై తీసుకోవాలి గానీ.. ‘పేదల కడుపుపై కొట్టడం’ మంచిది కాదని అన్నా క్యాంటిన్ల జోలికి పోవద్దని చెప్పాడు. మీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుంటే టీడీపీ చందాలు వేసుకొని క్యాంటిన్లను నిర్వహిస్తుందని మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి వినలేదు. దీంతో పేదలకు, సిటీలో ఉండే భిక్షగాళ్లకు, ఏదైనా పని కోసం సిటీలకు వెళ్లే పేదలకు హోటళ్లలో భోజనం ఆర్థిక భారం పెంచేది.

అయితే చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత తన మూడో సంతకం ‘అన్నా క్యాంటిన్’ ఓపెన్ ఫైళ్లపై పెట్టారు. దీంతో చంద్రబాబు నాయుడు వస్తే చాలు పేదలైనా, ధనవంతులైనా వారి కడుపు నిండుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు మొత్తం రాష్ట్రం రుణపడి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా అన్నా క్యాంటిన్లు తెరుచుకోవడం శుభ పరిణామమని పలువురు వాపోతున్నారు.

TAGS