Anjani Kumar Suspension:తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా.. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డిజిపి అంజనీకుమార్ మర్యాద పూర్వకంగా కలుసుకోవడం వివాదానికి దారి తీసింది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీ ఆయనను సస్పెండ్ చేసిన విషయ తెలిసిందే. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అంజనీకుమార్ను ఈసీ సస్పెండ్ చేసింది. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చుకున్న ఆయన.. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని తెలిపారు.
ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని.. మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది.