Vangalapudi Anitha : అనితా వంగలపూడి: టీచర్కు కర్రలు కట్టారు
Vangalapudi Anitha : ప్రభుత్వాలు ఏర్పడడమే కాదు.. అందులో సీఎం నుంచి మంత్రుల వరకు పదవులు ఎవరెవరికి ఏఏ శాఖలు వస్తాయన్నదానిపై కూడా ప్రజలు ఆసక్తిగా ఎదిరి చూస్తారు. ఇక టీవీల్లో అయితే పెద్ద ఎత్తు డిబేట్లు జరుగుతుంటాయి. సీఎంకు దగ్గరి వ్యక్తులు ఎవరు. వారికి ఏఏ శాఖలు వస్తాయి. పార్టీలో విధేయులు ఎవరు? వారికి ఏఏ శాఖలు కేటాయిస్తారన్న క్యూరియాసిటీ ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది.
చంద్రబాబు నాయుడి కొత్త కేబినెట్ విషయంలో ఈ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. హోం మంత్రి పదవికి సంబంధించి చాలా చర్చలు జరిగాయి. మొదట పవన్ కళ్యాణ్ కు ఇస్తారని పుకార్లు వచ్చాయి. ఎందుకంటే పొత్తు, కూటమి ఏర్పడడం, దాన్ని ప్రభుత్వంలోకి పట్టుకురావడం కోసం ఆయన చేసిన కృషి కారణం. కానీ ఆయన హోం వద్దని సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత నారా లోకేశ్ కు దక్కతుందని అనుకున్నారు. కానీ ఆయన అంత కేపబులిటీ క్యాండెట్ కాదని వాదనలు వచ్చాయి. ఆ తర్వాత హోంలో ఒక మహిళ ఉంటే బాగుంటుందని భావించిన చంద్రబాబు వంగలపూడికి అప్పగించారు.
పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేబినెట్లో హోం మంత్రి పదవి దక్కింది. వైసీపీ హయాంలో కూడా మహిళ హోం మంత్రి కాగా, చంద్రబాబు ఒక మహిళను హోం మంత్రిగా నియమించడం ద్వారా దీన్ని కొనసాగించారు. జిల్లాలో పలువురు సీనియర్ నేతలు ఉన్నప్పటికీ హోంను దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే అనితా వంగలపూడి. పార్టీ పట్ల విధేయత కారణంగా చంద్రబాబు ఆమెకు శాఖను కేటాయించారు. ఆమె అంకితభావం, పోరాట పటిమ ఆమెకు హోం మంత్రి పదవిని సంపాదించిపెట్టాయి.
వంగలపూడి అనిత ఉపాధ్యాయురాలిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2014కు ముందు టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అనిత 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు.
2019 ఎన్నికల్లో టీడీపీ నాయకత్వం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు మార్చింది. దీంతో 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైంది. అయినా కూడా ఆమె పార్టీపై నోరు పారేసుకోలేదు. విధేయతగా పని చేశారు. మరింత ఎక్కువ కష్టపడ్డారు. గత ఐదేళ్లుగా తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆమె వెనక్కి తగ్గలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చి తాను హోం మంత్రి అయితే కొడాలి నాని, విజయసాయిరెడ్డి టార్గెట్ అవుతారని అనిత చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అది నిజమైంది.