Keerthy Suresh : మరోసారి వార్తల్లోకి అనిరుధ్, కీర్తి సురేశ్.. పెళ్లి ఎప్పుడంటే ?  

Keerthy Suresh

Keerthy Suresh

Keerthy Suresh : ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో ఎదిగింది. మహానటి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కీర్తి సురేష్. ఈ సినిమాకు కీర్తి సురేష్‌కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ మంచి హిట్ కోసం చూస్తోంది. అయితే కొంతకాలం క్రితమే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇవి పుకార్లు మాత్రమేనని తేలిపోయాయి.

అయితే, ఇప్పుడు కీర్తి సురేష్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఆమె అతడిని పెళ్లి చేసుకోబోతుంది అన్నది నిజమేనా? నిజమే అయితే పెళ్లెప్పుడు అంటూ ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో వాస్తవం లేదని తెలుస్తోంది. కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి, అవన్నీ వాస్తవాలు కాదని తేలిపోయింది. ఇది నిజం కాదని కీర్తి సురేష్ తండ్రి కూడా చెప్పారు. అనిరుధ్ మంచి స్నేహితుడని కీర్తి సురేష్ గతంలోనే చెప్పుకొచ్చింది.

TAGS