Animal Movie OTT:రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను సరికొత్త కోణంలో ఆవిష్కరించి `అర్జున్ రెడ్డి`తో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ పాథ్ బ్రేకింగ్ మూవీ తరువాత మరో ఫ్రెష్ స్టోరీతో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా `యానిమల్`. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
టీజర్ రిలీజ్ రోజు నుంచే దేశ వ్యాప్తంగా అంచనాల్ని పెంచేసిన `యానిమల్` ట్రైలర్‌తో ఆ అంచనాల్ని మరింతగా పెంచేసి సగటు సినీ లవర్స్‌ని షాక్‌కు గురి చేసింది. తొలి రోజే వసూళ్ల పరంగా భారీ ఫిగర్స్‌పై కన్నేసిన `యానిమల్` అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌ని కూడా ఫైనల్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. `అర్జున్ రెడ్డి`కి మించి 3:21 గంటల నిడివితో విడుదలై రన్ టైమ్ విషయంలో హాట్ టాపిక్‌గా మారింది. రన్ టైమ్ పక్కన పెడితే కంటెంట్ పరంగా, తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన `యానిమల్`కు ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది.
బిజినెస్‌లో బిజీగా ఉండే ఫాదర్, తండ్రి ఆదరణ కోసం ఎదురు చూసే ఓ తనయుడి నేపథ్యంలో సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా ఈ మూవీని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించారు. తండ్రి ప్రేమ కోసం తనయుడు ఎంత వరకు వెళ్లాడు? ఎలాంటి మారణహోమానికి పూనుకున్నాడు అనే కథ, కథనాలతో ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తనదైన మార్కు నటనతో అదరగొట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే `యానిమల్` వన్ మ్యాన్ షో.
దేశ వ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి ముందే ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్‌ని ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. సినిమా థియేటర్లలో విడుదలై 6 నుంచి 8 వారాల తరువాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనే ఒప్పందం చేసుకున్నారట. ఆ ఒప్పందంలో భాగంగానే సంక్రాంతికి లేదా.. రిపబ్లిక్ డేన `యానిమల్` మూవీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.