Animal Movie:సినిమాలతో నష్టపోయేదే ఎక్కువ. లాభం ఉండదని సాంప్రదాయ వాదులు కొందరు వాదిస్తుంటారు. సినిమా కల్చర్ ని కూడా విమర్శిస్తుంటారు. అయితే అదే సినిమా ఇప్పుడు బంధాలు అనుబంధాలను గుర్తు చేస్తోంది. కుటుంబంలో కలహాలు ఉన్నా కలిసి జీవించేందుకు ఈగోల్ని పక్కన పెట్టడం ఎంతో గొప్పది అని సినిమా సందేశం ఇస్తోంది.
యానిమల్ రిలీజయ్యాక ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కుటుంబంలోని అపరిష్కృతంగా ఉన్న ఒక సమస్యకు పరిష్కారం దొరికింది. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు అన్న సంగతి తెలిసిందే. తన మొదటి భార్యకు సన్నీడియోల్, బాబి డియోల్ అనే ఇద్దరు కుమారులు ఉండగా, రెండో భార్య హేమమాలినికి ఇషా డియోల్ అనే కుమార్తె ఉన్నారు. అయితే డియోల్ కుటుంబంలో కొన్ని కలతలు ఉన్నాయి. సవతి తల్లి, సవతి సోదరికి డియోల్ బ్రదర్స్ కొంత ఎడంగా ఉన్నారు.
కానీ ఇటీవల యానిమల్ రిలీజ్ తర్వాత ధర్మేంద్ర రెండో కుమారుడు బాబి డియోల్ తన కుటుంబంలో కలతలను ఈగోలను పక్కన పెట్టి అందరితో కలిసిపోయాడట. ముఖ్యంగా యానిమల్ లో బాబి పాత్రతో అతడు బంధాలు అనుబంధాల గురించి ఎమోషనల్ గా కనెక్టయ్యాడట. ఇప్పుడు తమ కుటుంబంలో అందరితో కలిసిపోయినట్టు అతడు చెప్పాడు. ముఖ్యంగా యానిమల్ లో తన నటనకు సోదరి ఇషా డియోల్ ప్రశంసలు కురిపించారు. బాబీని పొగిడేస్తూ యు ఆర్ ది బెస్ట్ అంటూ ఇషా డియోల్ ప్రశంసించారు. సోదరుడిని విష్ చేసారు. అలాగే బాబి డియోల్ జమాల్ కుడు.. పాటకు ఇషా డ్యాన్సులు చేసింది. ఓవరాల్ గా అన్నా చెల్లెళ్లను ఈ సినిమా కలిపిందని భావించాలి. అలాగే హేమమాలిని తోను ఇప్పుడు డియోల్ ఎంతో హ్యాపీగా కలిసిపోతున్నాడట.