Sandeep Vanga : భీమవరం లో ‘ఎనిమల్’ డైరెక్టర్ సందీప్ వంగ కి చుక్కలు చూపించిన ప్రభాస్ ఫ్యాన్స్..అసలు ఏమైందంటే!
Sandeep Vanga : గత ఏడాది ‘ఎనిమల్’ చిత్రం తో పాన్ ఇండియా లెవెల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ చిత్రం తో దాదాపుగా ఆయన 900 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టాడు. వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని కూడా అందుకునేది కానీ, తృటిలో మిస్ అయ్యింది. సలార్ చిత్రం విడుదల అవ్వకపోయ్యుంటే కచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిలను అందుకునేది. ఇకపోతే ఈ చిత్ర దర్శకుడు సందీప్ వంగ రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా భీమవరం కి విచ్చేశాడు.
భీమవరం అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అడ్డా అనే విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. సందీప్ వంగ కనిపించగానే ప్రభాస్ ఆయన కార్ కి అడ్డం పడిపోయారు. ఎవరు ఇంతమంది ముందుకు వచ్చారు, కొట్టేస్తారా ఏంటి అని సందీప్ వంగ బయపడిపోయాడట. ఆ తర్వాత కార్ గ్లాస్ డోర్ క్రిందకి దించిన తర్వాత ఆ అభిమాని మాట్లాడడం మొదలు పెట్టాడు.
అతను మాట్లాడుతూ ‘అన్నా..మొన్న ఎనిమల్ సినిమా చూసాను..అదరగొట్టేశావ్, మా ప్రభాస్ అన్నతో సినిమా తీస్తున్నవి అట కదా, బాగా తియ్యి, ఇండస్ట్రీ రికార్డులు బద్దలు అవ్వాలి’ అని అన్నాడు. దీనికి సందీప్ వంగ ‘తప్పకుండా బ్లాక్ బస్టర్ ఇస్తా’ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడట. ప్రభాస్ తో సందీప్ వంగ ‘స్పిరిట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి దాదాపుగా మూడేళ్లు అయ్యింది. కానీ ప్రభాస్ తన సినిమాలతో బిజీ ఉండడం, సందీప్ వంగ తన పూర్తి ఫోకస్ ఎనిమల్ చిత్రం మీద పెట్టడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభాస్ మారుతీ తో ఒక సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా పూర్తి అవ్వగానే ‘ఎనిమల్’ చిత్రం మొదలు అవుతుంది. సెప్టెంబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఈ సినిమాకంటే ముందుగా ‘కల్కి’ చిత్రం పూర్తి చెయ్యాలి. ఎందుకంటే ఈ సినిమాని మే 9 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా ప్రారంభం అయ్యింది.