Trpti dimri:రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైంది త్రిప్తి దిమ్రీ. ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది రెండు చోట్లా ఈ భామకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. సినిమాలో రణబీర్‌తో ఘాటైన బెడ్ రూమ్ సన్నివేశాల్లో జీవించిన ట్రిప్తి అందచందాలు, నటనకు యూత్ స్పెల్ బౌండ్ అయిపోయారు. అదే క్రమంలో తనను ఇన్‌స్టాగ్రమ్ లో 40లక్షల మంది అనుసరిస్తున్నారు. యానిమల్ రిలీజ్ తర్వాత పెరిగిన ఇమేజ్ ఇది. ట్రిప్తీకి ఇప్పుడు దక్షిణాది ఫాలోవర్స్ వల్లనే ఇంత స్పీడ్ సాధ్యమైందని విశ్లేషిస్తున్నారు.
ఇక ఇదే హుషారులో ఈ బ్యూటీ ప్రభాస్ సరసన స్పిరిట్ మూవీలో నటించనుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో భారీ అవకాశాల్ని అందుకుంటోంది. ఇటు సౌత్‌లో పలువురు దర్శక నిర్మాతలు అడ్వాన్స్ సూట్ కేసులతో త్రిప్తి వెంటపడుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. యానిమల్ చిత్రంలో నటించినది చిన్న సహాయక పాత్ర అయినా త్రిప్తికి ఇది అంత పెద్ద బ్రేక్ నిచ్చింది.
అయితే త్రిప్తి దిమ్రీ వ్యక్తిగత జీవితంపైనా ఇటీవల ప్రజల్లో ఆసక్తి ఎక్కువైంది. ఈ భామ గత ఎఫైర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. యానిమల్ కి ముందు అనామకంగా ఉన్న ట్రిప్తీని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆసక్తిగా తరచి చూస్తున్నారు. త్రిప్తి ఇంతకుముందు బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోదుడు కర్నేష్ తో ప్రేమాయణం సాగించింది. కానీ ఆ జంట ఆ తర్వాత బ్రేకప్ అయ్యారు. ఆ తర్వాత సామ్ మర్చంట్ అనే మోడల్ కం బిజినెస్ మేన్ తో ప్రేమాయణం సాగిస్తోందని కథనాలొచ్చాయి. ఆ ఇద్దరూ జంటగా ఉన్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
కానీ ఇప్పుడు దీనిపై త్రిప్తి దిమ్రీ అధికారికంగా స్పందించింది. తాను ఎవరితోను డేటింగ్ చేయడం లేదని ఒంటరిగా ఉన్నానని తెలిపింది. సామ్ తో తాను డేటింగ్ చేయడం లేదు. ఇలాంటివి ప్రచారం కావడం సహజంగా ఉన్నదే. అన్ని రంగాల్లోను ఇది ఉంది! అని వ్యాఖ్యానించింది. పాపులర్ హిందీ పోర్టల్ ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన త్రిప్తి ప్రస్తుతానికి ఒంటరిగా ఉన్నానని క్లారిటీనిచ్చింది.