Tripti Dimri : ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని దక్కించుకోవడం అంత సులభమైన విషయం కాదు. అది హీరో అయినా హీరోయిన్ అయినా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసిరాకపోతే ఎన్ని ఉన్నా వృధా ప్రయత్నమే. అదే అదృష్టం కలిసి వస్తే చిన్న పాత్ర చేసినప్పటికీ కూడా స్టార్ అయిపోతుంటారు. ఇది వరకు ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసాము. ‘ఎనిమల్’ బ్యూటీ త్రిప్తి దిమిరి పరిస్థితి కూడా ప్రస్తుతం అలాంటిదే.
‘ఎనిమల్’ చిత్రం లో ఈమె నటించిన బోల్డ్ సన్నివేశాలకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ రష్మిక కంటే కూడా ఎక్కువగా ఈమెకే ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, దర్శక నిర్మాతలు కూడా త్రిప్తి దిమిరి కి బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఆమెని తమ సినిమాల్లో తీసుకునేందుకు క్యూలు కడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే త్రిప్తి దిమిరి చాలా కాలం నుండి ఒక యంగ్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి.
త్వరలోనే అతనితో పెళ్లి అంటూ కూడా వార్తలు వినిపించాయి. దీని గురించి ఆమె రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ప్రస్తుతం నాకు అలాంటి ఉద్దేశ్యాలు ఏమి లేవు. సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని నేను అంతగా పట్టించుకోను. ప్రస్తుతం నా ద్రుష్టి మొత్తం సినిమాల పైనే ఉంది. బాలీవుడ్ ఆఫర్స్ తో పాటుగా టాలీవుడ్ నుండి కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది.
ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి అబ్బాయిని ఎంచుకుంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ‘పెద్దగా డబ్బు, అందం లేకపోయినా పర్వాలేదు కానీ, మంచి మనసు ఉంటే చాలు. ఆ మంచి మనసు నాకు కనెక్ట్ అయితే ఆ అబ్బాయికి నేనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది త్రిప్తి దిమిరి. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈమెకి టాలీవుడ్ లో చాలా అవకాశాలే వచ్చాయి అని టాక్ వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో త్రిప్తి దిమిరి ని హీరోయిన్ గా తీసుకున్నట్టు సమాచారం. అంతకు ముందు ఆమె బదులుగా శ్రీలీల ఈ పాత్రకి ఎంపిక అయ్యింది. ఇప్పుడు ఆమెని రీప్లేస్ చేసినట్టు తెలుస్తుంది.