JAISW News Telugu

Tripti Dimri:`యానిమ‌ల్` బ్యూటీ డేటింగ్‌పై కొత్త అప్‌డేట్

Tripti Dimri:ర‌ణ‌బీర్ క‌పూర్ యానిమ‌ల్ చాలా మందికి రీఫ్రెష్ ట్రీట్ ని ఇచ్చింది. ముఖ్యంగా ఇందులో న‌టించిన బాబి డియోల్ ఇప్పుడు బిజీ స్టార్ గా మారేందుకు స‌హ‌క‌రించింది. బాబీ విల‌న్ గా క‌నిపించింది కొద్ది సేపే అయినా అత‌డి పాత్ర‌ను తీర్చిదిద్దిన తీరు, క్రూరుడిగా అత‌డు న‌టించిన విధానం పెద్ద‌గా వ‌ర్క‌వుటైంది. ఇక ఇదే సినిమాతో ట్రిప్తి దిమ్రీ పేరు మార్మోగింది. ఈ బ్యూటీ కొన్ని నిమిషాల పాటు తెర‌పై కనిపించినా వేడెక్కించే పెర్ఫామెన్స్ తో ర‌క్తి క‌ట్టించింది. ర‌ణ‌బీర్ తో ఘాటైన బెడ్ రూమ్ స‌న్నివేశాల్లో జీవించింది. దీంతో యూత్ కి ఈ బ్యూటీ బాగా క‌నెక్ట‌యిపోయింది.

ట్రిప్తి ఇంత‌కుముందు ప‌లు చిత్రాల్లో ఇంత‌కంటే గొప్ప న‌ట‌న‌తో మెప్పించింది. కానీ యానిమ‌ల్ తో వ‌చ్చిన క్రేజ్ అప్పుడు రాలేదు. ఇప్పుడు ట్రిప్తి కి అటు ఉత్త‌రాది ఇటు ద‌క్షిణాది రెండు చోట్లా అవ‌కాశాలొస్తున్నాయి. త‌దుప‌రి ప్ర‌భాస్ స‌ర‌స‌న సందీప్ వంగా స్పిరిట్ లో అవ‌కాశం అందుకుంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. అదంతా అటుంచితే ట్రిప్తి గురించి ఓ గాసిప్ అంత‌ర్జాలంలో వేడెక్కిస్తోంది.

ట్రిప్తి ఇంత‌కుముందు స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ సోద‌రుడు క‌ర్నేష్ తో డేటింగ్ చేసింది. కానీ ఆ జంట ఆ త‌ర్వాత విడిపోయారు. అత‌డి నుంచి విడిపోయిన త‌ర్వాత మోడ‌ల్ కం బిజినెస్ మేన్ సామ్ మ‌ర్చెంట్ తో డేటింగ్ చేస్తోంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అంతేకాదు సామ్ తో క‌లిసి ట్రిప్తి షికార్లు చేసిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.

త్రిప్తి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ లో వరుస చిత్రాలను షేర్ చేసింది. ఈ జంట ఓ పెళ్లికి వెళ్లిన‌ప్ప‌టి ఫోటోలు అవి. ట్రిప్తి అందమైన తెల్లని లెహంగాతో అద్భుతంగా కనిపించింది. వీటిలో ట్రిప్తి సామ్ మర్చంట్‌తో ఉన్న ఫోటోని కూడా షేర్ చేసింది. దీంతో ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు వచ్చాయి.
అయితే సామ్ మర్చంట్‌తో తనకున్న సంబంధం గురించి త్రిప్తి ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు.

సామ్ మర్చంట్ ఎవరు?

సామ్ మర్చంట్ ఇన్ స్టా బయో ప్రకారం.. అతడు గోవాలోని వాటర్స్ బీచ్ లాంజ్ అండ్ గ్రిల్ వ్యవస్థాపకుడు. డెక్కన్ క్రానికల్‌లోని క‌థ‌నం ప్రకారం, సామ్ 2002లో గ్లాడ్‌రాగ్స్ మాన్‌హంట్ పోటీలో గెలుపొందాడు. అతడు అంతకు ముందు మోడల్‌. తర్వాత వ్యాపారవేత్తగా మారాడు. త్రిప్తి గతంలో అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో డేటింగ్ చేసింది. వారు రహస్యంగా డేటింగ్ కొన‌సాగించారు. అందరి ముందు తమ సంబంధం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే ఆ త‌ర్వాత‌ వారు తమ ఫోటోల‌న్నిటినీ సామాజిక మాధ్య‌మాల నుంచి తొలగించారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు అనుసరించలేదు. దీంతో బ్రేక‌ప్ అయిందంటూ ప్ర‌చారం సాగింది.

Exit mobile version