Srivari Laddu : శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతులు, స్వామీజీల ఆగ్రహం
Srivari Laddu Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెద్దపులిపాకలో హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు మాట్లాడారు. ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వామివారి సన్నిధిలో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని సూచించారు.
శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగాలివ్వాలని చెప్పారు. ప్రభుత్వం, ప్రజలు కలిసి ధర్మాన్ని రక్షించాలన్నారు. ల్యాబ్ నివేదికలు మనకు ఆధారం కావున ఆ నివేదికలు కల్తీ ఉందని స్పష్టం చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ల్యాబ్ ల నివేదిక ప్రకారం కోర్టుకు వెళ్లాలని, కోర్టు విధించిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని పీఠాధిపతులు, స్వామీజీలు స్పష్టం చేశారు.