JAISW News Telugu

Anganwadi Strike : అంగన్వాడీల సమ్మె ఉధృతం..ఏపీలో కలెక్టరేట్ ల ముట్టడి

Anganwadi Strike

AP Anganwadi Strike

Anganwadi Strike : తమ డిమాండ్ పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీతో చేపట్టిన సమ్మె 23వ రోజుకు చేరుకుంది.  ఈ నేపథ్యంలో అంగన్వాడీలు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. నేడు ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు బైఠాయించి నిరసనను తెలుపుతున్నారు.  అమలాపురంలో కలక్టరేట్ ను వందలాది మంది అంగన్వాడీలు ముట్టడించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని వారు హెచ్చరించారు.

అంగన్వాడీలు సమ్మె విరమించకపోతే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడంతో అంగన్వాడీలు మండిపడు తున్నారు. తాటాకు చప్పుళ్లకు  భయపడేది లేదని అంగన్వా డీలు  హెచ్చరించారు. గత 23 రోజులు గా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యక ర్తలు వివిధ రూపాల్లో  చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.

న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్య లను పట్టించు కోవడం లేదని అంగన్వా డీలు వ్యక్తం చేస్తున్నారు. సమ్మె శిబిరంలో సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వ రరావు, సీ ఐటీయూ నాయ కులు కె.కృష్ణవేణి,జి. దుర్గా ప్రసాద్,నూకల. బలరా మ్, కె.బేబీ గంగార త్నం,పి.అమూల్య తదితరులు పాల్గొన్నారు..

Exit mobile version