Poll Pulse Survey : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నామినేషన్ల పర్వం మొదలైంది. వచ్చే నెలలో ప్రజలు ఓటింగ్ లో పాల్గొని తీర్పు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ, టీడీపీ, జనసేన జత కట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో నిలిచి ముందకు సాగుతున్నది. జగన్ మాత్రం తన పరిపాలన మీద భరోసాతో ఒంటటరిగా బరిలోకి దిగారు. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాననే ధీమాతో సిద్ధం పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
పోల్ పల్స్ సర్వే..
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరికీ పట్టం కట్టనున్నారో తెలుసుకునేందుకు ఫోల్ పల్స్ అనే సంస్థ సర్వ్ చేపట్టింది. అందుకు సంబందిచిన ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. సుమారు 25 పేజీలతో ఉన్న నివేదికను వెల్లడించింది సంస్థ. తన సర్వేలో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించబోతోంది.మెజార్టీ ఎంత వస్తుంది. ప్రజలు ఏ నాయకుడివైపు మొగ్గుచూపుతున్నారు. పార్లమెంట్ స్థానాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తున్నారు.ఎవరి పరిపాలన బాగుంది. ఇప్పుడు ఎవరికీ అధికారం ఇవ్వబోతున్నారనే అంశాలపై సర్వ్ చేపట్టింది ఆ సంస్థ.
ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం 175 సీట్లల్లో రాజకీయ పోరు జరుగుతోంది. ఇందులో తెలుగుదేశం,జనసేన,భారతీయ జనతా పార్టీ కూటమి 98 నుంచి 104 స్థానాల్లో విజయం సాదిస్తుందని సర్వేలో తేలింది. అదే విధంగా జగన్ అభ్యర్థులు 54 నుంచి 60 సీట్లలో గెలుస్తారు అని తేలింది. 23నియోజకవర్గాల్లో మాత్రం ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ అభ్యర్థులు 51.2 శాతం ఓట్లు సాధిస్తారు. అదేవిదంగా జగన్ అభ్యర్థులు 42. 8 శాతం ఓట్లు సాధిస్తారు. కాంగ్రెస్ పార్టీ 3.6 ఓట్ల తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన నాయకులూ 2. 4 శాతంతో ఇతర పార్టీ అభ్యర్థులను ఇబ్బంది పెడుతారు.
ఏపీలో ప్రధానంగా నాలుగు పార్టీలు లోకసభ తోపాటు అసెంబ్లీకి తమ అభ్యర్థులను బరిలో దింపాయి. ముఖ్యంగా 25 పార్లమెంట్ స్థానాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తారో సర్వేలో తేలింది. జనసేన పార్టీ మచిలీపట్నం,కాకినాడలో విజయం సాదిస్తుందని సర్వేలో తేలింది. అనకాపల్లి,నరసాపురం,రాజమండ్రి నియోజకవర్గాల్లో బిజెపి జెండా ఎగురవేస్తుందని తేలింది. అదే విధంగా అరకు, కర్నూల్, తిరుపతి, రాజంపేట, నంద్యాల, కడప నియోజకవర్గాల్లో జగన్ బరిలో దింపిన అభ్యర్థులు విజయం సాదించనున్నారని సర్వేలో తేలింది. విజయనగరం లోకసభకు మాత్రం పోటీ తీవ్రంగానే ఉందని పోల్ పల్స్ ప్రీపోల్ తన సర్వేలో ప్రకటించింది. పోల్ పల్స్ ప్రీపోల్ చేపట్టిన సర్వేఫలితాలను వెల్లడించింది.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఐదేళ్ల జగన్ పరిపాలన ఏవిదంగా ఉంది వంటి పలు అంశాలపై సర్వ్ చేపట్టింది ఆ సంస్థ. 32 శాతం మంది జగన్ పరిపాలనకు అనుకూలమన్నారు. తిరిగి ఆంధ్రాలో జగన్ అధికారం చేపడుతారని 41 శాతం చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి 42.5, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 50 శాతం ప్రజలు మొగ్గుచూపారు. రాష్ట్రంలో సమస్యలపై కూడా ప్రజలు మొహమాటం లేకుండా పెదవివిప్పారు. కనీస సౌకర్యాలపై 21, ధరలు అదుపులో లేవంటూ 18 శతం, అవినీతిపై 14 శాతం, రైతులను పట్టించుకోలేదంటూ 13 శాతం, ఉద్యోగ నియామకాలు లేవంటూ 15 శాతం మంది నిర్మొహమాటంగా మనసులోని మాట చెప్పారు.