AP Revenue : ఏపీ ఆదాయం పెరిగిందా? తగ్గిందా?

AP revenue increased or decreased?

AP revenue increased or decreased?

AP Revenue : గత ఐదేండ్ల కాలంలో ఏపీ ఆదాయం పెరిగిందా..తగ్గిందా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ప్రధాన పత్రికల్లో వచ్చే కథనాలు ప్రజలను అయోమయంలో ముంచెత్తుతున్నాయి. కొన్ని పత్రికలు జగన్ రెడ్డి పాలనలో ఏపీ ముప్పై ఏండ్ల వెనక్కి వెళ్లిందని రాస్తున్నాయి. మరో పత్రికలో ఏపీ అద్భుతంగా డెవలప్ అయ్యిందని రాస్తుంది. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియడం లేదు. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం కేంద్ర గణాంకాలను చూసి ఏపీ ఆదాయం పెరిగిందని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ ఉన్న రాష్ట్రమని వారు చెబుతున్నారు. 17శాతం జీఎస్డీపీతో ఉంది.  ఏపీకి ఆదాయం లేదని కొందరంటున్నారని, కానీ మొన్న ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లోనే రాష్ట్ర వాటా కింద కేంద్రం నుంచి వచ్చిన వాటా ఏకంగా రూ.49,364 కోట్లు రాబోతున్నాయి. తెలంగాణకు రూ.25,639 కోట్లు రాబోతోంది. 2023 బడ్జెట్ కంటే ఏపీకి 4,666 కోట్లు,  తెలంగాణకు 2,432 కోట్ల ఎక్కువ మొత్తం రాబోతోంది.

15వ ఆర్థిక సంఘం ప్రకారం మొత్తం కేంద్ర పన్నుల  వాటాలో ఏపీ 4.047 శాతం, తెలంగాణకు 2.102శాతం అందిస్తోంది.  దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి గతం కంటే ఈసారి  1,15,239 అధిక మొత్తం ఇవ్వబోతున్నారు. ఇక ఏపీకి 5,589 కోట్లు, తెలంగాణకు దాదాపు 6 వేల కోట్ల రుణం కూడా కేంద్రం ఇవ్వబోతోంది.

ప్రతిపక్ష నేతలు, వాటి అనుబంధ పత్రికలు ఆరోపిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కేంద్రం దగ్గర వేల కోట్ల అప్పులు తెస్తోందడనం కూడా తప్పేనని విశ్లేషకులు అంటున్నారు. కేంద్రం ఒక లెక్క ప్రకారం మాత్రమే అప్పులు ఇస్తుందని చెప్పారు. అయితే కేంద్ర నిధులు వస్తున్నా రాష్ట్ర ఆదాయం కూడా బాగానే ఉందని రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

TAGS