JAISW News Telugu

Andhra Pradesh : పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఆహ్వానం: ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు

FacebookXLinkedinWhatsapp
Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh : పెట్టెబడులకు ఏపీ ఆహ్వానం పలుకుతోందని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ విషయమై ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ తో భేటీ అయినట్లు సీఎం వెల్లడించారు. శక్తివంతమైన రాష్ట్ర సంస్కృతి, విస్తారమైన సామర్థ్యం గురించి చర్చించినట్లు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోందని, అనుకూలమైన ప్రభుత్వం, పర్యావరణ వ్యవస్థ వేచిచూస్తున్నాయని ఎక్స్ లో పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై సీఎం చంద్రబాబును బుధవారం సచివాలయంలో తానా సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ విజయం కోసం కృషి చేసిన ప్రవాసాంధ్రులను చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు. మాజీ అధ్యక్షుడ జయశేఖర్ తాళ్లూరి, చికాగో తెలుగు సంఘం ప్రతినిధి రవిచంద్ర అనుమాల, న్యూయార్క్ ప్రతినిధి వంశీ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version