pet friendly ride : ఇక పెట్ ఫ్రెండ్లీ రైడ్ సర్వీస్.. ఎప్పుడు..? ఎక్కడ..? ఎలాగంటే?

pet friendly ride

pet friendly ride

pet friendly ride service : బిజీ లైఫ్ లో మనుషుల మధ్య ఉన్న బంధాలు ఎప్పుడో కనుమరుగయ్యాయి. ఆ తర్వాత ఆ ప్లేస్ ను పెట్స్ (కుక్కలు, పందులు, పిల్లులు) భర్తీ చేశాయి. ఎక్కువ మంది ఒంటరి వారు తోడు వెతుక్కునే కంటే పెట్స్ ను తెచ్చుకుంటే చాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఉబర్ ఇండియా  పెట్ ఫ్రెండ్లీ రైడ్ ను తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇది బెంగళూర్ లో అందుబాటులో ఉంది. ఎలాగంటే గతంలో పెట్లను తమ కంపెనీ క్యాబ్ లలో అనుమతించరు. కానీ పెట్ ఫ్రెండ్లీ రైడ్ వచ్చాక యజమానులతో పాటు వారి పెట్లను కూడా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. పెంపుడు జంతువులను క్యాబ్ లలోకి అనుమతించాలని దేశ వ్యాప్తంగా చాలా వినతులు వచ్చాయి. బయటికి వెళ్లేప్పుడు పెట్స్ ఇంట్లో వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తే ఇబ్బందిగా ఉందని అందుకే పెట్ రైడ్ కు అనుమతివ్వాలని కంపెనీని కోరారు. వారి అభ్యర్థనతో కంపెనీ ఈ సదుపాయాన్ని కల్పించింది. ఇది త్వరలో దేశ వ్యాప్తంగా తీసుకువస్తామని ఉబర్ చెప్పింది. లాంచ్ సందర్భంగా, ఉబెర్ ఇండియా రైడర్ వర్టికల్స్ హెడ్ శ్వేత మంత్రి మాట్లాడుతూ, ‘పెంపుడు జంతువులు వారి కుటుంబాలకు ఎంత ముఖ్యమో  అని మేము అర్థం చేసుకున్నాము. పెంపుడు జంతువుల యజమానులకు మరియు వారి సహచరులకు ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి, సౌకర్యవంతంగా చసేందుకు ఉబర్ పెట్ మా ప్రయత్నం’ అన్నారు.

TAGS