JAISW News Telugu

Vundavalli Anusha : యాంకర్ శ్యామల ఆ పనులు చేసి నీతులు చెబుతున్నావా.. ఉండవల్లి అనూష ఫైర్

Undavalli Anusha

Vundavalli Anusha-Anchor Shyamala

Vundavalli Anusha : యాంకర్ శ్యామల తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవాలని ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తోంది. ఏపీలో వైసీపీ అభ్యర్థులను గెలింపిచాలని తెగ స్పీచులు ఇస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్న ఒక ఇంటర్వ్యూలో టీడీపీ, జనసేన పై పరోక్షంగా విమర్శలు చేసి నోరు పారేసుకుంది. అంతే ఆమెను ఉండవల్లి అనూష ఒక రేంజ్ లో ఆడేసుకుంది.

యాంకర్ శ్యామల ఒక ఇంటర్వ్యూలో ముసలి తోడేలు.. గుంటనక్క స్టోరీ చెప్పారు. ఇది చంద్రబాబు, పవన్ కల్యాణ్ గురించే చెప్పినట్లు అర్థమవుతుంది. దీంతో టీడీపీ, జనసేన అభిమానులు ఆమె పై రెచ్చిపోయారు. నువ్వు, నీ చీకటి బాగోతాలు బయటపెడతాం. పోనీ లే చూస్తుంటే కులపిచ్చితో ఏదేదో మాట్లాడుతున్నావ్.. నువ్వు నీ భర్త కలిసి చేసిన అరాచకాలను బయట పెట్టమంటావా అంటూ ఉండవల్లి అనూష హెచ్చరించింది.

యాంకర్ శ్యామల, ఆమె భర్త ఇద్దరు జగన్ కులానికి చెందిన వారు కావడంతో వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో శ్యామల జోరుగా ప్రచారం చేస్తోందని అనూష మండిపడింది.  అయితే యాంకరింగ్ చేయడం ఆమెకు అలవాటైన పనే కాబట్టి ప్రచారంలో దూసుకుపోతుంది. అయితే ఆమె చెప్పిన పొడుపు కథ మాత్రం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.  ఇన్ని రోజులు ఎక్కడెకెళ్లావు.. ఆంధ్రాలో ఉన్నది ఉంటున్నది మేము.. మా బాధలు నీకెం తెలుసు.. ఎన్నికలు రాగానే వచ్చి నాలుగు ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లి పోవడం కాదు. ఇక్కడ బాధలు పడింది మేము… అయినా తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టినపుడు ఆమె పంచన చేరి కుల పిచ్చి చూపించావు.

తిరిగి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి జగన్ తరఫున ప్రచారం చేస్తున్నావు. నీకు కులపిచ్చి ఉందని చెప్పడానికి ఇంత కంటే మంచి ఉదాహరణ దొరకదు. అయినా ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రచారం చేసే పోయే వాళ్లకు ఏం తెలుస్తుంది. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే నీ చీకటి బాగోతాలు, నువ్వు నీ భర్త చేసిన గలీజ్ పనులు అన్ని బయట పెట్టాల్సి వస్తుందని ఉండవల్లి అనూష యాంకర్ శ్యామలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version