Anchor Anasuya : జబర్దస్త్ యాంకర్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ ఆ పాపులారిటీ తో ఇప్పుడు సినిమాల్లో మోస్ట్ డిమాండ్ ఉన్న లేడీ విలన్ మరియు క్యారక్టర్ ఆర్టిస్టు గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలు చేసే అదృష్టం ఆమెకి దక్కింది. జబర్దస్త్ యాంకర్ కాకముందు కూడా ఆమె అనేక టీవీ చానెల్స్ కి మీడియా రిపోర్టర్ గా పని చేసింది, అప్పట్లో ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా చేసింది.
మద్యమద్యలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది కానీ, ఏమాత్రం గుర్తింపు ని సంపాదించలేకపోయింది. కానీ ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ లోకి అడుగుపెట్టిందో, ఆమె జాతకమే పూర్తిగా మారిపోయింది.అయితే ఈమధ్యనే ఆమె జబర్దస్త్ షో లో యాంకర్ రోల్ చెయ్యడం ఆపేసింది. కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాదు, ఆమె మరే ఇతర టీవీ చానెల్స్ లో కూడా యాంకర్ గా కనిపించడం లేదు. తన పూర్తి ఫోకస్ మొత్తం ఇప్పుడు సినిమాల పైనే పెట్టింది.
అయితే సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే అనసూయ తరచూ ఎదో ఒక పోస్టు పెడుతూ ఉంటుంది. తనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చెయ్యడమే కాకుండా, తన మీద వచ్చే నెగటివిటీ మీద కూడా చాలా ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది అనసూయ. అయితే రీసెంట్ గా ఆమె తన ఇద్దరు కొడుకుల గురించి చెప్తూ, ఇంస్టాగ్రామ్ లో వేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘ నా జీవితం లో నాకు లభించిన అత్యంత విలువైన బహుమతులు ఈ ఇద్దరు చిన్నారులు. వీళ్లిద్దరి వల్లే నేను ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నాను. విపరీతమైన ఒత్తిడి నుండి ఇంటికి వచ్చే నన్ను ఈ ఇద్దరు ఎంతో ప్రేమగా పలకరిస్తారు, నాకు మనసు బాగాలేనప్పుడు నన్ను నవ్విస్తారు. నా కుటుంబం నా పక్కన ఉంటే నేను సమయాన్ని అసలు పూర్తిగా మర్చిపోతాను. అది గంటలు అవ్వొచ్చు, రోజులు అవ్వొచ్చు అలా గడిచిపోతూ ఉంటుంది’ అని ఆమె పెట్టిన ఒక వీడియో పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ఇకపోతే అనసూయ ప్రస్తుతం ‘పుష్ప : ది రూల్’ చిత్రం లో నటిస్తుంది. మొదటి భాగం లో ఆమె పాత్రకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము, రెండవ భాగం లో కూడా ఆమె రోల్ హైలైట్ కాబోతుంది అట. ఇప్పటికే ఆమెకి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యినట్టు తెలుస్తుంది.