Anasuya Sen Gupta : అనసూయ సేన్ గుప్తా అద్భుత రికార్డు.. కేన్స్ లో ఉత్తమ నటి అవార్డు సొంతం

Anasuya Sen Gupta

Anasuya Sen Gupta

Anasuya Sen Gupta : 77 వ కేన్స్ ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా ఇండియన్ యాక్ట్రెస్ అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటిగా అవార్డు పొంది చరిత్ర సృష్టించింది. అన్ సర్టెయిన్ రిగార్డ్ విభాగంలో ఆమె ఈ గౌరవాన్ని దక్కించుకుంది. ఈ అవార్డు అందుకున్న మొట్ట మొదటి భారతీయురాలిగా నిలిచింది. సేన్ గుప్తా ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేసి మంచి గుర్తింపు పొందారు. ఆమె ప్రస్తుతం గోవాలో ఉంటోంది. కాన్ స్టాంటివ్ బోజనోస్ అనే బల్గేరియన్ డైరెక్టర్ తీసిన ది  షేమ్ లెస్ సినిమాలో నటించినందుకు ఉత్తమ అవార్డు లభించింది.  ఈ సినిమాలో మితా వశిస్ట్ నటించారు.

షేమ్‌లెస్‌లో అనసూయ సేన్‌గుప్తా వేశ్యగా నటించింది. ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని ఢిల్లీ నుంచి పారిపోయి సెక్స్ వర్కర్ గా ఆశ్రయం పొందిన రేణుక అనే పాత్రలో జీవించింది. ఓమారా శెట్టి అనే యువకుడితో రేణుకా ప్రేమ వ్యవహారం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ ఇండియాతోపాటు నేపాల్‌లో 45 రోజుల చేశారు. ఈమె ఈ చిత్రంలో అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొంటుంది. శారీరకంగా ఒక వేశ్యకు ఎదురయ్యే అన్ని సవాళ్లను ఎలా స్వీకరించాలో తెలుసుకుంటుంది.

ఈ అవార్డు స్వీకరించిన అనంతరం అనసూయ మాట్లాడుతూ.. తన అవార్డును క్వీర్ కమ్యూనిటీ, ఇతర నిమ్న వర్గాల వారికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. అవార్డు స్వీకరించే సమయంలో ఆమె తీవ్ర బావోద్వేగానికి గురై ఏడ్చేశారు. దీంతో అక్కడున్న వారు అందరూ చప్పట్లతో ఆమెను ఎంకరేజ్ చేశారు. ఈ అనసూయ సేన్ గుప్తా అనే నటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు. ఈ సినిమాలో ఢిల్లీలోని పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసును చంపి అక్కడి నుంచి పరారవుతుంది. అనంతరం ఒక వ్యక్తితో ప్రేమలో పడుతుంది. దీని చుట్టూనే కథ నడుస్తుంది. కేన్స్ లో ఈ చిత్రం ప్రదర్శితమవుతున్నంత సేపు అందరూ ఎంతో ఆసక్తిగా చూశారు.

TAGS