Anasuya Mother Role : స్టార్ హీరోకు తల్లి పాత్రలో అనసూయ.. ఆ సినిమా ఏంటంటే?
Anasuya Mother Role : అందమైన సొగసు, ఆకట్టుకునే మాట, పొడవాటి సౌష్టవం కలిస్తే యాంకర్ అనసూయ భరద్వాజ్. న్యూస్ ఛానల్ తో మొదలైన ఆమె కెరీర్ ప్రస్తుతం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఆమె కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పిన షో జబర్ధస్త్, ఈ షోతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. కేవలం అనసూయను చూసేందుకు చాలా మంది గురువారం వరకు వేచి చూసే వారు. ఆ తర్వాత షోకు రేటింగ్ పెరగడంతో ఎక్స్ ట్రా తీసుకువచ్చారు అది వేరే విషయం. కానీ జబర్ధస్త్ కు ఆదరణ, అనసూయకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఆ తర్వాత అమ్మడు సినిమాల వైపు దృష్టి పెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రాధాన్యమున్న పాత్రలు వేస్తూ అభిమానుల మన్ననలు పొందారు. ఇక సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆరోపణలు, ట్రోల్స్ ఎదుర్కొన్నా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రధానంగా విజయ్ దేవరకొండ, ఆయన ఫ్యాన్స్ తో విపరీతమైన ట్రోల్స్ కు గురయ్యారు అనసూయ. ఇక ఈ గొడవకు ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకొని ఆమే విజయ్ కి తనకు ఎలాంటి గొడవలు లేవని, కెరీర్ పరంగా కలిసే పని చేస్తామని చెప్పి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టారు.
ఈ హాట్ బ్యూటీ గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అనసూయ ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిపాత్రలో నటిస్తుందట. ఆ హీరో కూడా ఎవరో కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని.. తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగిన సిద్దు చిన్నప్పటి క్యారెక్టర్ కు మదర్‌గా చేస్తుందట. ఈ మూవీ మొత్తం అనసూయ తల్లి సెంటిమెంట్‌లో నటించనుందట. అమ్మ గొప్పతనం వర్ణించే కథ కాబట్టి హాట్ యాంకరైన అనసూయ భరద్వాజ్ వెంటనే ఒకే చెప్పేసిందట. ఈ మూవీ అనసూయ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలవబోతుందని అనసూయ ఫ్యాన్స్ హ్యాపీ కామెంట్స్ పెడుతున్నారు.